నల్లమల అడవుల్లో మనుషులు సంచరించాలంటే ధైర్యం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ అడవి చాలా భయంకరంగా ఉంటుంది.
- నల్లమల అడవులు గుంటూరు జిల్లాలోని గుత్తికొండలు అని ప్రాంతంలో నల్లమల అడవులు పుట్టాయి.
- ఇవి తూర్పు కనుమల్లో ఒక భాగం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఐదు జిల్లాల్లో కర్నూలు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా,గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా,కడప జిల్లా వరకు విస్తరించి ఉంది.
- నల్లమల మధ్య భూభాగంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో పులుల అభయారణ్యం ఉంది. దీనికి రాజీవ్ అభ్యా అరణ్యం అని పేరు పెట్టారు ఇది దేశంలోని 19 పులుల సంరక్షణ కేంద్రంలో ఒకటి.
- నల్లమల అడవి ప్రాంతంలో అటవీక తెగులు చెంచులు ఇప్పటికీ నివసిస్తున్నారు.
- నల్లమల అడవులను నల్లమల కొండలు అని కూడా పిలుస్తారు. ఈ అడవి మొత్తం కొండలతో నిండి ఉంటుంది.
- నల్లమల అడవి మధ్య భూభాగంలో రైలు మార్గం కూడా ఉన్నది. గుంటూరు నుంచి గుంతకల్ వరకు రైలు ప్రయాణం చేసేవారు నల్లమల అడవిని అంతో అందంగా చూడవచ్చు.
- నల్లమల అడవి ప్రాంతంలో ఎక్కడ చూసినా కొండలు లోయలు ఎత్తైన చెట్లతో ఎంతో ఆకర్షణీయంగా కళ్ళకి ఎంతో కనువిందుగా కనిపిస్తాయి. ఈ అడవిలో పులులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి.
- ఈ అడవిలో బైరానికొండ, గుండ్ల బ్రహ్మేశ్వరం ఉన్నాయి, వీటిని చేరుకోవాలంటే చాలా ప్రమాదకరమైన అడవి మధ్యలో ప్రయాణించవలసి ఉంటుంది.
- నల్లమల అడవుల్లో వజ్రాలు మరియు పురాతన సంపద చాలా వరకు దాగి ఉన్నాయని ప్రచారం ప్రాచుర్యంలో వచ్చింది. అనేక జిల్లాల్లో నుంచి ప్రజలు వజ్రాల వేట కోసం ఇక్కడికి వస్తుంటారు.
- ఆత్మకూరు నుండి నంద్యాల వరకు వెళ్లే మార్గంలో నల్ల కాలువ గ్రామానికి సమీపంలో వైయస్సార్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
- భయంకరమైన విషయం ఏమిటంటే చాలా మందికి మూఢనమ్మకాలు నమ్మేవారు గుప్త నిధులు కోసం ఈ అడవుల్లో నరబలి చేస్తుంటారు. మనుషులను నరబలిని చేసిన ప్రదేశాలలో ఆనవాళ్లు చాలా వరకు కనిపించాయి.
- నల్లమల అడవిలో అన్వేషణ చేసి యురేనియం ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. అక్కడ ఉన్న యురేనియం బయటకుుతీస్తే అక్కడ ఉన్న జంతు జీవులు జాతులు చాలా వరకు నష్టం జరిగే ప్రమాదం ఉంది.
- ఈ నల్లమల అడవులు లాంటి అడవులే మనకు జీవనోపాదులుగా మన రాబోయే కాలానికి నిలువ ఉంటుంది.
- పెన్నా నది మరియు కృష్ణా నదులకు మధ్యన ఉత్తర దక్షిణ దిశగా దాదాపు 150 కిలోమీటర్ల వరకు ఈ నల్లమల అడవులు విస్తరించి ఉన్నాయి.
నల్లమల్ల అడవుల్లో జరిగిన యదార్ధ సంఘటనలు
- కొన్ని సంవత్సరాల క్రితం శివ స్వాములు శ్రీశైలం వస్తు ఈ అడవి దారి తప్పిపోయారు అప్పటి ప్రభుత్వం వీరిని హెలికాప్టర్ ద్వారా గాలించి జాడను వీరి జాడను కనుగొన్నారు.
- 2009 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రయాణిస్తూ హెలికాప్టర్ ద్వారా ఈ అటవీ ప్రాంతంలోని కుప్పకూలిపోయారు. సెప్టెంబర్ 2 2009 ఉదయం మరణించడం జరిగింది. దీంతో ముఖ్యమంత్రి మరణించిన ప్రదేశం పావురాల గుట్ట ప్రాచుర్యంలోకి వచ్చింది.
- గుప్తనిధుల కోసం అడవుల్లోకి బయలుదేరిన చాలా మంది వ్యక్తులు ఇప్పటికీ ప్రాణాలతో తిరిగి రాలేదు.
- అడవి దగ్గరలో నివసించే ప్రజలు అప్పుడప్పుడు కట్టెల కోసం ఈ అడవుల్లోకి వెళ్తుంటారు ఇలా వెళ్లిన వాళ్లలో కొంతమంది క్రూర మృగాలకు బలైపోయారు.
- ఈ అటవీ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చే పర్యాటకులకు చాలామంది ప్రాణాలు ప్రమాదంలోకి తెచ్చుకున్నారు వారిని అటవీ రక్షణ శాఖ హెలికాప్టర్ ద్వారాను లేదా అక్కడ ఉన్న ఆఫీసర్ల ద్వారా రక్షించబడ్డారు.
- నల్లమల అడవుల్లో ఉన్న యురేనియం ఖనిజనిక్షేపాల కోసం వెలికితీతకు ప్రయత్నాలు కూడా జరిగాయి.
నల్లమల్ల అటవీ పరివాహక ప్రాంతంలో మానవ జీవనం
ఈ ప్రాంతంలో పట్టణాలు, నగరాలు పెరగకపోవడానికి కారణం నీటి కొరత ఎక్కువగా ఉండడం. అందువల్ల ఇక్కడ జనజీవనం అత్యల్పంగా ఉంటారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఆటవిక తెగలు చెంచులు నివసిస్తున్నారు. నల్లమల్ల అడవుల్లో దగ్గర ప్రాంతంలో పెద్ద పట్టణం ఏదైనా ఉంది అంటే అది నంద్యాల పట్టణం అని చెప్పవచ్చు.
Post a Comment