తాజ్ మహల్ నిర్మాణం - రహస్యాలు
ప్రపంచం మొత్తానికి మనదేశంలోని ఆగ్రాలో గల తాజ్ మహల్ ను ఒక ప్రేమ గుర్తుగా షాజహ కట్టించాడని తెలుసు. ఒక సీజన్ అనేది కూడా లేకుండా సంవత్సరం పొడవునా ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు ఈ అద్భుత నిర్మాణ సౌందర్యాన్ని చూడటానికి వస్తూనే ఉంటారు. తాజ్ మహల్ ను మొగల్ చక్రవర్తి తన భార్య ముంతాజ్ పై ప్రేమ చిహ్నం గా నిర్మించాడు ఈ మహత్తర నిర్మాణాన్ని 1631 లో మొదలై 1653 వరకు కొనసాగింది. అరుదైన ఈ కట్టడం యమునా నది ఒడ్డున కలదు. తెల్లని పాలరాయితో నిర్మించబడిన తాజ్మహల్ నిర్మాణం ప్రపంచం 7 వింతల్లో ఒకటిగా కూడా చోటుచేసుకుంది. అయితే తాజ్ మహల్ గురించి కొన్ని వాస్తవాలు కూడా తప్పక తెలుసుకోవాలి వాటిని తెలుసుకుంటే మీకు తాజ్ మహల్ గురించి మరింత ఆశ్చర్యం కలుగుతుంది.
1. తాజ్ మహల్ ప్రతిరూపాలు.
2. ముంతాజ్ అసలు పేరు.
షాజహాన్ తన మూడవ భార్య ముంతాజ్ పై ప్రేమ గుర్తుగా తాజ్ మహల్ నిర్మించాడనే విషయం అందరికీ తెలిసిందే. ముంతాజ్ మహల్ పేరు మీద ఈ కట్టడానికి తాజ్ మహల్ అనే పేరు ఏర్పడింది. అయితే ముంతాజ్ మహల్ అసలు పేరు అది కాదు ఆమె అసలు పేరు "అర్జు మండ్ భాను బేగం".
3. ముంతాజ్ మరణం ఎందుకు.
ఇప్పటికీ కూడా ప్రేమ గురించి ప్రస్తావన వస్తే తాజ్ మహల్ తలుచుకోని వారు ఉండరు. శతాబ్దాలు గడిచినా ఈ కట్టడం అంతలా ప్రజల హృదయాలను గెలుచుకుంది. అయితే ఈ నిర్మాణానికి కారణమైన ముంతాజ్ ఎలా మరణించింది అనే విషయం చాలా మందికి తెలియదు. ఆమె షాజహాన్ 14వ బిడ్డను జన్మిస్తూ తన ప్రాణాలను కోల్పోయింది.
4.1000 ఏనుగుల వినియోగం.
శతాబ్దాలు గడిచిన నేటికీ చెక్కచెదరకుండా ఈ నిర్మాణం నిలిచిందంటే అందులో వినియోగించిన సాంకేతిక నిర్మాణ సామగ్రి ఎంతో దృడమైనదని నమ్మక తప్పదు. తాజ్మహల్ నిర్మాణం కోసం వినియోగించిన సామాగ్రిని ఒకచోట నుండి మరొకచోట తరలించేందుకు దాదాపు 1000 ఏనుగులను వినియోగించారు.
5. తాజ్ మహల్ నిర్మాణం కోసం28 రకాల రాళ్లు వినియోగం.
తాజ్ మహల్ అనగానే కేవలం పాలరాతి నిర్మాణం మాత్రమే ప్రతి ఒక్కరి గుర్తుకు వస్తుంది, కానీ దానిని నేరుగా సందర్శించి నిశితంగా పరిశీలిస్తే తర్వాత వారికి ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ఈ నిర్మాణం పై ఉండే వివిధ డిజైన్లను 28 రకాల విలువైన రాళ్లతో చెక్కారు దగ్గరగా వెళ్లి చూస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ రాళ్లు చూడడానికి ఎంతో ఆకర్షణంగానో మరియు కళ్ళకి ఎంతో అందంగానో కనిపిస్తుంది.
6. వివిధ రంగుల వినియోగం
రాత్రివేళ వెన్నెల వెలుగులో తాజ్ మహల్ వీక్షించడం నిజంగా ఒక గొప్ప అనుభవం అని చెప్పవచ్చు ఎందుకంటే రోజంతా ఒకలా కనిపించే ఈ నిర్మాణం చంద్రుని వెలుగుల్లో కొత్త రంగులను అద్దుకుంటుది. కొన్ని సందర్భాల్లో సూర్యుడు అస్తమయ్యే సమయంలో కూడా తాజ్ మహల్ రంగు విభిన్నంగా కనిపిస్తుంది. కృష్ణానది ఒడ్డున్న తాజ్మహల్ ను చూస్తే చంద్రుని వెలుగులో మన ఆనందానికి అవధులు ఉండవు.
7. తాజ్ మహల్ పై చెక్కబడిన శ్లోకాలు.
తాజ్ మహల్ సందర్శనకు వెళ్ళినప్పుడు ఈ నిర్మాణాన్ని దగ్గరగా పూర్తిగా పరిశీలించండి. ఇలా పరిశీలించడం ద్వారా తాజ్ మహల్ యొక్క మరొక ప్రత్యేకత మీరు కనుగొనే అవకాశం ఉంటుంది. కావున తాజ్ మహల్ సముదాయంలో నిర్మాణం పై మీకు ప్రతి చోట ఖురాన్ శ్లోకాలు రాసి కనిపిస్తాయి. ఈ శ్లోకాలు తాజ్ మహల్ చుట్టు ఉన్న ప్రహరీ గోడల పైన చెక్కి ఉన్నట్లు కనిపిస్తాయి.
8. ముంతాజ్ బేగం సమాధి.
తాజ్ మహల్ ను షాజహాన్ ముంతాజ్ బేగం కోసం ప్రేమ గుర్తుగా కట్టారని చాలామందికి తెలిసిన విషయమే. కానీ అసలు విషయం ఏమిటంటే ముంతాజ్ చనిపోయినప్పుడు ముంతాజ్ కి షాజహాన్ ఎప్పుడు దగ్గరగా ఉండాలి అని ఈ సమాధిని ముంతాజ్ గుర్తుగా షాజహాన్ కట్టి తాజ్ మహల్ అనే పేరుని పెట్టారు.
9. వివిధ దేశాల నుండి నిర్మాణ సామగ్రి.
దాదాపు 22 సంవత్సరాలు పాటు కష్టించి నిర్మించిన ఈ కట్టడంలో వినియోగించిన సామగ్రి ఎక్కడెక్కడ నుంచి తీసుకువచ్చారో తెలుసా? మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. భారత దేశంలోని పంజాబ్ రాజస్థాన్ ప్రాంతాలతో పాటు వివిధ దేశాల నుండి ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక ,చైనా, టిబెట్, అరేబియా నుంచి తాజ్ మహల్ నిర్మాణ సామాగ్రిని తీసుకువచ్చారు.
10. నల్లని రాతితో మరో నిర్మాణం.
అనేక చారిత్రక కట్టడాల కథనాల ప్రకారం షాజహాన్ నల్లని రాతిని ఉపయోగించి మరో తాజ్ మహల్ నిర్మించాలని భావించాడట అయితే తన కుమారులతో యుద్ధం చేసి ఓటమి చెందడం వలన అతడు ఆ నిర్మాణాన్ని మొదలుపెట్టలేకపోయాడు.
Wonder World
ReplyDeleteGood article.
ReplyDeleteI like tajmahal
ReplyDeletePost a Comment