Interesting facts about gorilla - 🦍 గొరిల్లా
గొరిల్లా ఆఫ్రికాలో కాంగో ప్రాంతాల్లో ఉంటుంది. అడవుల్లో నివసించే గొరిల్లాకు వాటికి, కొండల మీద నివసించే గొరిల్లాకు కొద్దిగా తేడాలుంటాయి. చూడడానికి చాలా భయంకరంగా ఉండే ఈ గొరిల్లా 5- 6 అడుగుల ఎత్తులో మరియు 5-6 వందల పౌండ్ల వరకు బరువు ఉంటుంది.
కొంత మానవుని ఆకారం దీని లక్షణాల్లో మనకు కనిపిస్తుంది. అసలు దీని పేరుకు అర్థం అడవి మనిషి అని అర్థం వస్తుంది.
గొరిల్లా చెవులు చిన్నవి. కళ్ళ పైన దట్టమైన గోడ ఉంటుంది. దాని కోర పన్ను చాలా పెద్దది. దాన్ని చూడగానే, శత్రువులకి వణుకు పట్టుకుంటుంది.
గొరిల్లా ఎంత భయంకరమైన సాధారణంగా మనిషికి ఎటువంటి హాని చేయదు. కానీ అది అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఎలాంటి శత్రువునైన ఎదుర్కోవడానికి తయారుగా ఉంటుంది.
గొరిల్లా గుండెను ఎందుకు గట్టిగా బాదుకుంటుంది?
కోపం వచ్చినప్పుడు నోరు తెరిచి భయంకరమైన దంతాలు చూపించి చేతులతో గుండె డబ,డబ బాదుకుంటుంది. అయితే ఇతర సమయాల్లో, ఆనందం ఉత్సాహం అధికమైనప్పుడు కూడా ఇలాగే కొట్టుకుంటుంది.
గొరిల్లా ఏటువంటి ఆహరం తీసుకుంటుంది?
గొరిల్లా ఆహారం ముఖ్యంగా ఆకులు,అలమలే అయితే ఒక్కొక్కప్పుడు పక్షుల గుడ్లు, పక్షులను కూడా తింటాయి. ముఖ్యంగా పిల్ల గొరిల్లాలు చాలా అల్లరిగా ఉంటాయి. వీటి అల్లరి ఎలా ఉంటుంది అంటే ,చెట్లని నాశనం చేస్తాయి తోటలను కూడా ధ్వంసం చేస్తాయి.
గొరిల్లా అడవిలో ఎక్కడ నిద్రపోతుంది?
సాధారణంగా 30 - 40 గొరిల్లాలు ఒక కుటుంబానికి చెందినది తిరుగుతాయి. సాయంకాలం వచ్చేసరికి చెట్లు ఎక్కి ప్రతి 🦍 గొరిల్లా గూడు లేక పడకను వేరుగా ఏర్పాటు చేసుకుంటాయి. తండ్రి - గొరిల్లా నాయక - గొరిల్లా చెట్టు కిందనే కాపలా కాస్తూ ఉంటాయి. బహుశా దాని బరువు కూడా ఎక్కడానికి పైన పడుకోవడానికి అనుకూలంగా ఉండదు. కాబట్టి కాపలా కాస్తాయి అనుకోవచ్చు.
గొరిల్లాలో మగవాటిని male, ఆడవాటిని female అంటారు. వాటి పిల్లను infant అని గొరిల్లా గుంపును band అని పిలుస్తారు.
గొరిల్లాకు ఈదడం రాదు. ఇది దాదాపు 815 కేజీలు బరువు ఎత్తగలుగుతుంది. కానీ ఇప్పటివరకు సామాన్య మానవుడు గిన్నిస్ రికార్డు ప్రకారం బరువు ఎత్తింది 500 కేజీలు మాత్రమే. గొరిల్లా ఇంత బరువు ఎలా ఎత్తగలుగుతుందంటే, కాళ్లు చేతిలో ఉన్న జంతువుల్లో గొరిల్లా అన్నింటి కంటే పెద్దది.
గొరిల్లాకు బలం ఎంత ఉంటుంది?
20 సంవత్సరాలు వయసున్న గొరిల్లా 20 మంది మనుషులకు ఉన్నంత బలం ఉంటుంది. ఇది గంటకి 40 కి.మీ వేగంతో పరిగెత్తగలదు.
గొరిల్లాల DNA 🧬 మానవులతో సమానంగా ఉంటుంది. మానవుని డిఎన్ఏ 95% నుంచి 99% వరకు మ్యాచ్ అవుతుంది. చింపాంజీల తర్వాత మానవులకు అతి సన్నిహితంగా ఉండేవి గొరిల్లాలే.
గొరిల్లా జీవితకాలం సాధారణంగా 35 నుంచి 40 సంవత్సరాలు ఉంటుంది. కానీ జూ గొరిల్లాలు 50 సంవత్సరాల వరకు జీవించే అవకాశం ఉంది.
సాధారణంగా గొరిల్లాలు చాలా బిడియం గలవి. వాటికీ ఇబ్బంది కలిగే విధంగా ఎవరైనా బెదిరించిన లేక వాటికి కోపం తెప్పించే విధంగా ప్రవర్తించినా కూడా అవి అకస్మాత్తుగా కోపాన్ని ప్రదర్శిస్తాయి. అటువంటి పరిస్థితులలో ఇది భయంకరంగా గర్జిస్తూ ప్రతి దాడి మానవులపై ప్రతి దాడి చేస్తాయి.
గొరిల్లా అన్ని జాతులు (ఉపజాతులు కూడా) IUCN రెడ్ లిస్ట్ లో అంతరించిపోతున్నట్లు జాబితాలో చేర్చబడ్డాయి.
ప్రపంచం మొత్తంలో సుమారు 2 లక్షల గొరిల్లాలు ఉన్నాయి. ఎక్కువగా ఇవి మధ్య ఆఫ్రికాలో దట్టమైన అడవుల్లో జీవిస్తూ ఉంటాయి.
Post a Comment