The Real Story of Rudramadevi (రుద్రమదేవి)
భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి ఒకరు. కాకతీయుల పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది 'రాణి రుద్రమదేవి'.
ఆడపిల్లలు ధైర్యంగా ఉంటే వెంటనే గుర్తు వచ్చే పేరు రుద్రమదేవి. వందల సంవత్సరాలగా ధైర్యానికి ఉదాహరణగా నిలిచిన రాణి రుద్రమదేవి జీవితం గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
రుద్రమదేవి కాకతీయుల వంశానికి చెందిన మహారాణి. కాకతీయ అనే దేవతను ఆరాధించేవారు కాబట్టి వీరికి కాకతీయులు అనే పేరు వచ్చింది.
ఓరుగల్లు రాజధానిగా చేసుకొని తమ రాజ్యాన్ని విస్తరించుకున్నారు. వేయి స్తంభాల గుడి వంటి అనేక కట్టడాలను నిర్మించారు. చెరువులు తవ్వించి వేలాది ఎకరాల బీడు భూములను పచ్చటి పొలాలుగా మార్చారు.
కాకతీయుల వంశంలోనే ఎక్కువ రోజులు రాజ్యాన్ని పాలించిన వారు గణపతి దేవుడు. పాలించడమే కాకుండా ఇప్పటి కృష్ణాజిల్లా మొదలుకొని కంచి వరకు తెలుగువారు ఉన్న ప్రాంతాలన్నింటినీ ఓకే రాజ్యం కిందికి తీసుకువచ్చాడు.
రుద్రమదేవి - జీవిత విశేషాలు
గణపతి దేవుడు తర్వాత అంత పెద్ద రాజ్యాన్ని పాలించేందుకు ఒక వీరుడు ఉండాలి కదా.. కానీ గణపతి దేవుడుకు మగ పిల్లలు లేరు. ఉన్న ఇద్దరు ఆడపిల్లల్లో రుద్రమదేవి పెద్దది. ఆమెని మగ పిల్లలకి దీటుగా పెంచారు. గుర్రపు స్వారీ, కత్తి స్వాము వంటి యుద్ధ విద్యలన్నీ ఆమెకు నేర్పించారు. తండ్రి నమ్మకాన్ని రుద్రమదేవి వమ్ము చేయలేదు. ఎలాంటి పోటీ పెట్టిన ఎంతటి ప్రత్యర్థినైన చిటికెలో చిత్తు చేసి పారేసేది. రోజులు గడిచే కొద్దీ కాకతీయ సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న వారంతా ఎదురు తిరగడం మొదలుపెట్టారు. మరోపక్క గణపతి దేవుడు కూడా ముసలివాడు అయ్యాడు. అటువంటి క్లిష్ట పరిస్థితులలో కూడా గణపతి దేవుడు తన సింహాసనానికి వారసురాలిగా రుద్రమదేవికి పట్టాభిషేకం చేశాడు. అసలే పగతో రగిలిపోతున్న సామంత రాజులు ఒక ఆడపిల్ల తమను పరిపాలించడం మొదలుపెట్టిందని తెలియగానే రెచ్చిపోయారు. ఒకవైపు నుంచి చోళులు, మరొకవైపు నుంచి మరాఠాలు ఆమె రాజ్యాన్ని చుట్టుముట్టారు. కానీ రుద్రమదేవి తక్కువేమీ కాదు వాళ్లందరిని చిత్తుగా ఓడించి అందరినీ వెనక్కి పంపింది.
రుద్రమదేవి సామాన్యమైనది కాదని తెలియగానే మహాదేవుడు అనే యాదవ రాజు లక్షల మంది సైన్యాన్ని కూడా గట్టుకొని ఒక్కసారిగా రాజ్యం మీదకు విరుచుకుపడ్డాడు. అతడిని రుద్రమదేవి తన సైన్యాధిపతులైన గోన గన్నారెడ్డి వంటి వీరులతో కలిసి తరిమి తరిమి కొట్టింది. అతడు మళ్ళీ తన వంక చూసే ధైర్యం చేయకుండా మూడు కోట్ల బంగారు వరహాలను నష్టపరిహారంగా తీసుకొని వదిలేసింది రుద్రమదేవి.
రుద్రమదేవి - రాజ్యపాలన ఎలా ఉండేది?
ఒకపక్క ఎడతెరిపి లేకుండా తిరుగుబాటులతో సతమతమవుతున్న కూడా రుద్రమదేవి ప్రజలను, సంస్కృతిని అశ్రద్ధ చేయలేదు. రేవులను అభివృద్ధి చేసి విదేశాలకు సరిపడా ఇక్కడి ఉత్పత్తులను ఎగుమతి అయ్యేలా చర్యలు తీసుకుంది. తన తండ్రి మొదలు పెట్టిన ఓరుగల్లు కోటను పూర్తి చేసింది. మగవారి దుస్తులు ధరించి రుద్రమదేవి తన రాజ్యం అంతా తిరుగుతూ ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా వెంటనే ఆదుకునేది. అలాంటి సందర్భంలో రుద్రమదేవికి ప్రసవ వేదన పడుతూ చనిపోయిన ఒక స్త్రీ కనిపించింది. ఇక అప్పటినుంచి తన రాజ్యంలో ఇలా ప్రసవ వేదనతో ఎవరు చనిపోకూడదు అని భావించింది. అందువల్ల ప్రతి గ్రామంలో ఒక ఆసుపత్రి నిర్మించేలా ఆదేశాలు జారీ చేసింది. మార్కోపోలో వంటి విదేశీ యాత్రికులు సైతం రుద్రమ రాజ్యానికి వచ్చి ఆమె పాలన అద్భుతం అంటూ ప్రపంచానికి చాటి చెప్పారు.ఇలా 20 సంవత్సరాలకు పైగా రుద్రమదేవి రాజ్యాన్ని పాలించింది. ఆమె వయసు 80 ఏళ్లు తండ్రి లాగే తనకి కూడా మగ పిల్లలు లేకపోవడంతో తన కూతురి కొడుకు అయిన ప్రతాపరుద్రుని దత్తత తీసుకుంది.
రుద్రమదేవి - మరణం ఎలా సంభవించింది?
కడప ప్రాంతాన్ని పాలిస్తున్న అంబదేవుడు కాకతీయులతో ఎన్నోసార్లు యుద్ధం చేసి ఓడిపోయాడు. ఈసారి పాండ్యుల ను దేవగిరి రాజులను కూడా పెట్టుకుని ఓరుగల్లు మీదకి దండయాత్రకి బయలుదేరాడు. అంబ దేవుడికి బుద్ధి చెప్పేందుకు రుద్రమదేవి స్వయంగా యుద్ధ రంగంలోకి దిగింది. 80 ఏళ్ల వయసులో ఉన్న కూడా రుద్రమదేవిని ఓడించలేకపోయాడు అంబ దేవుడు. వారాల తరబడి సాగిన యుద్ధంలో ఒకరోజు రుద్రమదేవి తీవ్రంగా గాయపడింది. నేరుగా రుద్రమదేవిని ఎదుర్కొనలేక అంబ దేవుడి సైనికుడు ఆమెను వెనకాల నుంచి పొడిచాడని చరిత్ర చెప్తోంది. ఆ గాయంతోనే 1289 సంవత్సరం, నవంబర్ 27న నల్లగొండ జిల్లాలోని చందుపట్ల అనే గ్రామ సమీపంలో ఆమె చనిపోయినట్లు ఒక శాసనం దొరికింది.
రుద్రమదేవి చనిపోయిన కూడా ఆమె అందించిన స్ఫూర్తి మాత్రం చనిపోలేదు. అదే స్ఫూర్తితో ఆమె వారసుడైన ప్రతాపరుద్రుడు అంబ దేవుడిని తరిమి తరిమి ఓడించాడు. ఇప్పటికి కూడా తెలుగు వారందరికి రుద్రమదేవి పేరు గుర్తుకొస్తే చాలు జీవితంలో ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొనే ధైర్యాన్ని పొందుతారు.
Rudrama Devi History Super
ReplyDeleteGood information thanks, continuing your work.
ReplyDeletePost a Comment