బిట్ కాయిన్ (Bit Coin) అంటే ఏమిటి? What is bitcoin Telugu?



బిట్ కాయిన్ (Bit Coin) అనేది డిజిటల్ కరెన్సీ. కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా ఈ కరెన్సీని సంపాదించవచ్చు. మనం నివసిస్తున్న ప్రపంచంలో అతి తక్కువ కాలంలో అత్యధిక రాబడి ఇచ్చింది ఏదైనా ఉంది అంటే అది బిట్ కాయిన్ మాత్రమే. ఇటువంటి బిట్ కాయిన్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి అధికారికంగా పేపర్ నోట్ల రూపంలో ఒక కరెన్సీ అనేది ఉంటుంది. ఈ పేపర్ కరెన్సీకి ప్రత్యామ్నాయంగా అనేక డిజిటల్ అంటే వర్చువల్ కరెన్సీ లు మరియు క్రిప్టోకరెన్సీ లు తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు మనం వాడుతున్న క్రిప్టోకరెన్సీ లలో మొట్టమొదటిగా వచ్చింది బిట్ కాయిన్. ఇది తొలిసారిగా 2009 జనవరిలో విడుదల అయింది. ఈ టెక్నాలజీని రూపొందించిన వ్యక్తి ఇ ఎవరనేది ఇంతవరకు బయటికి రాలేదు. సంతోషి నకమోటో అని పేరు గల వ్యక్తి బిట్ కాయిన్ ను తయారు చేశారని ప్రచారంలో ఉంది.

బిట్ కాయిన్ మైనింగ్ అంటే ఏమిటి?



బిట్ కాయిన్ మైనింగ్ లో శక్తివంతమైన సాఫ్ట్ వేర్ ఉపయోగించి క్లిష్టమైన ఆల్గారిధమ్ పరిష్కరించి, లావాదేవీలను వెరిఫై చేస్తారు. మైనింగ్ చేసేవాళ్ళు ఈ ప్రక్రియలో విజయవంతంగా గెలుపొందితే వారికి కొన్ని రివార్డులు అందజేస్తారు. ఈ విధంగా కంప్యూటర్ లలో బిట్ కాయిన్ మైనింగ్ అనేది జరుగుతుంది.
ఒక్క బిట్ కాయిన్ విలువ ప్రస్తుతం ఇండియా కరెన్సీ లో 30 లక్షల వరకు ఉంది. 2009లో బిట్ కాయిన్ విలువ 40 పైసలు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు దీని విలువ అ లక్షల్లో పలుకుతోంది. రాబోయే రోజుల్లో ఒక బిట్ కాయిన్ కోటి రూపాయలకు చేరుకున్నా కూడా ఆశ్చర్య పడనక్కరలేదు.
కొత్త బిట్ కాయిన్ల సృష్టి అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఇందులో కఠినమైన ఆల్గారిధమ్ లను మైనర్లు పరిష్కరించాల్సి ఉంటుంది. ఇందుకు మనిషి మెదడు కంటే ఎన్నో రెట్లు గణాంక అధిక శక్తి అవసరం అవతుంది. దీనికోసం శక్తివంతమైన కంప్యూటర్ ప్రొఫెసర్లను రోజంతా నడుపుతూనే ఉండాలి. ఈ కారణంగానే బిట్ కాయిన్ కు ఒక బ్లాక్ ను జోడించినందుకు ఇచ్చే రివార్డు విలువ ఎక్కువగా ఉంటుంది.
కంప్యూటర్లలో మైనింగ్ చేయాలంటే శక్తివంతమైన గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లను (GPU) ఉపయోగించాల్సి ఉంటుంది.

బిట్ కాయిన్ కి సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు


  • ప్రపంచంలోని మొత్తం బిట్ కాయిన్స్ లలో సగానికి పైగా చైనాలోనే మైనింగ్ చేశారు.
  • బిట్ కాయిన్ లీగల్ గా అంగీకరించిన ఏకైక దేశం.. ఎల్ సాల్వెడార్.
  • బిట్ కాయిన్ విలువ పెరగడానికి కారణం దీన్ని క్రియేట్ చేసినపుడు కేవలం 21 మిలియన్ బిట్ కాయిన్స్  మాత్రమే ఉండేలా దీనిని ప్రోగ్రాం చేశారు. దీని తర్వాత కొత్త బిట్ కాయిన్ లను క్రియేట్ చేయలేరు. బిట్ కాయిన్ కొనే వాళ్ళ సంఖ్య రోజురోజుకూ పెరిగిపోవడంతో దీనికి డిమాండ్ బాగా పెరిగి దీని విలువ కూడా పెరిగిపోతోంది.
  • బిట్ కాయిన్ ఏ దేశపు ప్రభుత్వం గానీ, బ్యాంకు గాని కంట్రోల్ చేయలేదు.
  • కేవలం 2.1 కోట్ల బిట్ కాయిన్ల కంటే ఒక్క కాయ కూడా ఎక్కువ మనం మైన్ చేయలేం. దీన్ని రూపొందించిన అప్పుడే ఆ సాఫ్ట్ వేర్ ను అలా డిజైన్ చేశారు.
  • బిట్ కాయిన్లను సంతోషి లో కొలుస్తారు. అంటే ఉదాహరణకు ఇండియా కరెన్సీ రూపాయి అందరికీ తెలిసిందే. ఒక్క రూపాయి లో 100 పైసలు ఉంటాయి. అలాగే ఒక్క బిట్ కాయిన్ లో 10 కోట్ల సంతోషి లు ఉంటాయి. 10 కోట్ల సంతోషిలు కలిపి ఒక బిట్ కాయిన్ అన్నమాట.
  • 2009 జనవరి 3వ తేదీన బిట్ కాయిన్స్ నెట్వర్క్ను రూపొందించి మైనింగ్ అనేది ప్రారంభించారు.
  • ద గుడ్ వైఫ్ అనే ప్రముఖ అమెరికా టీవీ సిరీస్ లో బిట్ కాయిన్ పేరుతో ఏకంగా ఒక ఎపిసోడ్ నే రూపొందించారు. ఆ ఎపిసోడ్ 2012 లో ప్రసారం అయింది. అదే సంవత్సరంలో బిట్ కాయిన్ ఆర్గనైజేషన్ కూడా ప్రారంభించారు.

బిట్ కాయిన్ (Bitcoin) ఎలా కొనుక్కోవాలి?

బిట్ కాయిన్ మరియు ఇతర క్రిప్టోకరెన్సీ లను కొనుక్కుని దాచుకోవడానికి మనకు ఒక వ్యాలెట్ అవసరమవుతుంది. ఆ వ్యాలెట్ లో మన బ్యాంక్ అకౌంట్ జోడించి ఆ బ్యాంకు ద్వారానే బిట్ కాయిన్స్ కొనుక్కోవచ్చు. బిట్ కాయిన్ రేటు పెరిగిన వెంటనే దీనిని మనం అమ్ముకోవచ్చు.


ఇండియాలో ఎన్నో రకాల క్రిప్టో మార్పిడి వాలెట్ (Crypto exchange wallet) లు ఉన్నాయి. వాటిలో Coin Switch Kuber అనే App బిట్ కాయిన్స్ మరియు ఇతర క్రిప్టోకరెన్సీ లను
 కొనడానికి చాలా సులువుగా ఉంటుంది. 

మీరు కూడా బిట్ కాయిన్ మరియు ఇతర క్రిప్టో కాయిన్స్ లను కొనుక్కొని దాచుకోవాలి అంటే కింద ఇవ్వబడిన లింకు ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకుని రిజిస్టర్ అవ్వండి.





Post a Comment

Previous Post Next Post