Amazon forest secrets - అమెజాన్ అడవులు - రహస్యాలు

   Amazon forest secrets - అమెజాన్ అడవులలో దాగి ఉన్న రహస్యాలు  

 

  • ప్రపంచంలోనే అతి భయంకరమైన అడవులు ఈ అమెజాన్ అడవులు. ఈ అడవులను వర్షాధార అడవులు అని కూడా పిలుస్తారు.
  • అమెజాన్ లో ఒక దేశంలోనే కాకుండా చుట్టుపక్కల ఉండే అనేక దేశాల్లో విస్తరించి ఉన్నాయి.
  •  అమెజాన్ అడవులు సౌత్ అమెరికాలో విస్తరించి ఉన్నాయి. ఈ అమెజాన్ అడవులు దాదాపు 9 దేశాల్లో విస్తరించి ఉన్నాయి.
  • దాదాపు 60%  అంటే ఈ అడవులు విస్తరణలో రెండో వంతు బ్రెజిల్ లో విస్తరించి ఉంది.
  • అమెజాన్ అడవులు పెరు,కొలంబియా,వెనిజులా, బొలివియా ఈక్వడార్,డయానా,సురినామ్,ఫ్రెంచ్, గయానా లో విస్తరించి ఉన్నాయి.
 
అమెజాన్ అడవులు
  • అమెజాన్ రైన్ ఫారెస్ట్ ఎక్కువగా బ్రెజిల్ దేశంలోనే విస్తరించి ఉంది.
  • ఈజిప్ట్ లో ఉన్న అతి పొడవైన నది నైలు నది లాగానే ఈ అమెజాన్ అడవుల్లో కూడా అతి పొడవైన అమెజాన్ నది ఉంది.
  • ఈ అడవుల్లో 40,000 రకాల వింత వింత చెట్లు ఉన్నాయి.
  • మన భూమి మీద ఉన్న మొత్తం ఆక్సిజన్లో 20% ఆక్సిజన్ అమెజాన్ అడవుల్లో నుంచి ఉత్పత్తి అవుతుంది.
  • దట్టమైన చెట్ల ఆకుల వల్ల ఈ అడవి చాలా చీకటిగా ఉంటుంది. ఈ అడవిలోని నేలమీద కేవలం 2%  మాత్రమే సూర్యరశ్మి పడుతుంది.

అమెజాన్ అడవులు ఇంత దట్టంగా ఉండడంవల్ల వర్షం నేల మీద చేరడానికి దాదాపు పది నిమిషాలు పడుతుంది. అంటే ఈ అడవులు ఎంత దట్టంగా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు.

  • అమెజాన్ అడవుల్లో 20% ఆక్సిజన్ ఉండడం వల్ల ఈ అడవులను "ద లంగ్స్ అఫ్ ది ఎర్త్" భూమి యొక్క ఊపిరితిత్తులు అని అంటారు.
  • ప్రపంచంలో ఉన్న మొత్తం వర్షధార అడవులలో సగభాగం అమెజాన్ అడవులు .
  • మనం తినే ఆహార పదార్థాలైనా కాఫీ,చాక్లెట్,రైస్ టమాటోస్,పొటాటోస్,మిరియాలు,ఆపిల్,కార్న్ 80% లు కంటే ఎక్కువగా ఈ అడవుల నుండి లభిస్తాయి.
  • ఈ అడవులలో దాదాపు 400 -500 అటవీ జాతులు నివసిస్తూ ఉన్నాయి. వీటిలో దాదాపు 50 జాతులు ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు లేవు. ఈ జాతులలో కొన్ని జాతులలో "కానీ బాల్స్"అంటే మనుషులని తినే జాతి అని అన్నమాట.

  • సహారా ఎడారిలో ఉండే ఇసుక గాలి వల్ల ఎగిరి అమెజాన్ అడవుల్లో పడి ఇక్కడ మట్టితో కలిసి నేల సారవంతం అవుతుంది. దీనివల్ల కొత్త మొక్కలు పెరుగుతున్నాయి.
  • ఈ అమెజాన్ అడవులు 55 మిలియన్ల సంవత్సరాల నుండి ఈ amazon ఫారెస్ట్ ఉంది. 11,200 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రజలు నివసించేవారు.
  • ప్రపంచంలోనే రెండో అతిపెద్ద నది అమెజాన్ నది ఈ అడవుల మధ్య నుండి ప్రవహిస్తుంది. ఈ నది ప్రపంచంలో ఉన్న మిగిలిన అన్ని నదుల కన్నా ఐదు రెట్లు ఎక్కువ నీరు విడుదల చేస్తుంది. కానీ దీని మీద ఒక్క బ్రిడ్జి కూడా నిర్మించలేదు. బ్రెజిల్ లో ఈ నది నాలుగు కిలోమీటర్లు భూమి క్రిందన ప్రవహిస్తుంది.
  • ది రియల్ విక్టోరియా వాటర్ లిల్లీ అనే ఈ ఆకు ప్రపంచంలోని అతి పెద్ద ఆకుగా పేరుగాంచింది. ఇది కూడా ఈ అడవుల్లోనే పెరుగుతుంది. ఇవి 3 మీటర్ల వరకు ఉంటాయి,40 కేజీల బరువు వరకు మోయగలవు.
ది రియల్ విక్టోరియా వాటర్ లిల్లీ 

  • అమెజాన్ అడవులలో 2.5 మిలియన్ల కీటకాలు నివసిస్తున్నాయి.
  • ఈ అడవులలో దాదాపు 207 పక్షుల రకాలు ఉన్నాయి. వాటిల్లో ప్రపంచంలోనే అతి బిగ్గరగా అరిచే టౌకెన్ అనే పక్షి ఈ అడవులలోనే ఉంది దీని కోట దాదాపు అర మైళ్ల దూరం వరకు వినిపిస్తుంది.
  • ఈ అడవులలో రంగురంగుల చిలకలు, కింగ్ఫిషర్ అనే చిన్న పక్షి దీనినే కింగ్ ఫిషర్ బియర్ అనే లోగో లో వాడుతున్నారు.
  • ఈ అడవులలోని రోడ్డు ద్వారా చేరుకోలేని ప్రపంచంలోని అతిపెద్ద నగరం ఉంది. ఇక్విటోస్ అనే ఈ నగరం పెరు దేశంలో ఉంది. ఇది అమెజాన్ డీప్ ఫారెస్ట్ లో ఉంది. ఇక్కడ సుమారుగా 4 లక్షల మంది నివసిస్తున్నారు.
  • అమెజాన్ ఫారెస్ట్ అమోఘమైన పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది. సుమారు 40 వేల జాతుల మొక్కలు, 1300 రకాల పక్షులు, 3000 రకాల చేపలు, 430 రకాల క్షీరదాలు, 25 లక్షల రకాల కీటకాలు ఉన్నాయి.
పిరనా చేప
  • ప్రపంచంలోని కొన్ని ఆసక్తికరమైన ప్రమాదకరమైన జీవులు వర్షా అరణ్యంలోని నివసిస్తూ ఉన్నాయి. ఇందులో ఎలక్ట్రిక్ ఈల్స్,మాంసం తినే పిరానా చేపలు,విషకపలు,జాగ్వార్ లు నదులలో నివసించే విషపూరితమైన పాములు ఉన్నాయి.
  • అమెజాన్ రైన్ ఫారెస్ట్ లో" పిరానా" అనే పిలవబడే ఆసక్తికరమైన చేప కనిపిస్తుంది. ఈ చేప ఇతర చేపలను తింటుంది. దాదాపు 3 మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది దాని నోరు మరియు నాలుక రెండిటికీ దంతాలు ఉంటాయి.
  • అమెజాన్ అడవుల్లో జీవించే అడవి మనుషులు ఎక్కువగా సంచార జీవులు. సంచార జీవులు అంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తూ, వేటాడుతూ అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అడవి నుంచి బయటకు వచ్చి జీవించరు.

ప్రపంచంలో జరిగే అనేక విషయాలు, మానవులకు ఉపయోగకరమైన విషయాలను తెలుసుకోవడానికి ప్రతి రోజు మా బ్లాగ్ ని అనుసరించండి.




2 Comments

Post a Comment

Previous Post Next Post