జంతు ప్రపంచం గురించి ఆశ్చర్యకర విషయాలు
.jpg)
- అడవిలో ఉన్న సింహాలు ఒక సంవత్సరంలో 20 లేదా అంతకంటే తక్కువ జంతువుల్ని మాత్రమే వాటి ఆహారం కోసం చంపుతాయి.
- Tarantula spider అనే సాలె పురుగు ఆహారం లేకుండా రెండు సంవత్సరాల పాటు జీవిస్తుంది.
- సముద్రపు తాబేలు తమ విసర్జక అవయవాలతో కూడా గాలి పీల్చుకోగలవు.
- భూమి మీద ఇంతవరకు కనిపెట్టిన జీవుల్లో ఉపరితలం నుండి అత్యంత లోతులో జీవించగల జీవి డెవిల్ వామ్ (devil worm). ఇది భూ ఉపరితలం నుండి 3.6 కిలోమీటర్లు దిగువన కూడా దిగువన కూడా జీవించగలదు.
- మొసళ్ళు ఎప్పటికప్పుడు తమ పాత పళ్ల స్థానంలో కొత్త పళ్లను పొందుతూ ఉంటాయి. ఇవి తమ జీవితకాలం మొత్తం మీద మూడు వేల సార్లు కొత్త పళ్లను పొందుతాయి.
- ప్రపంచంలోనే అతి చిన్న పక్షి అయిన హమ్మింగ్ 🕊️ బర్డ్ (A humming bird) గుండె ఒక నిమిషానికి 1400 సార్లు కొట్టుకుంటుంది.
- భూమి మీద అతి పెద్దదైన తిమింగలం చేసే శబ్దం మిగిలిన అన్ని జంతువులు చేసే శబ్దాల కన్నా చాలా ఎక్కువ. ఇది 18 desibls వరకు శబ్దం చేయగలదు. ఈ శబ్దాలను సముద్రంలో ఎనిమిది వందల కిలోమీటర్ల దూరం నుంచి కూడా గుర్తించవచ్చు.
- బ్లూ రింగ్డ్ ఆక్టోపస్ (Blue - ringed octopus) ప్రపంచంలోనే విషపూరితమైన జంతువులలో ఒకటి. ఇది ఎంత విషపూరితమైనదంటే ఇది ఒక్కసారి మనిషిని కొరికితే మనిషి చనిపోతాడు. ఈ ఆక్టోపస్ విషానికి ఇప్పటివరకు విరుగుడు కనుక్కోలేక పోయారు.
- భూమిపై జీవిస్తున్న 80% జంతువులు కీటకాలు మరియు పురుగులే.
- భూమిపై నివసించే జంతువుల్లో స్టార్ ఫిష్ ఒక్కటే తన పొట్టను లోపల నుంచి బయటకు తిప్పగలదు.
- పులి యొక్క నాలుక చాలా దృఢంగా ఉంటుంది. అది ఎంత దృఢంగా ఉంటుందంటే, పులి ఒక్కసారి తన నాలుకతో బిల్డింగ్ యొక్క పెయింట్ ను ఒక్కసారి నాకితే పెయింట్ మొత్తం ఊడిపోతుంది.
- ఎలక్ట్రికల్ ఈల్ చేపల నుంచి వచ్చే కరెంటు చార్జ్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందంటే, దీని యొక్క కరెంటు చార్జి తో 50 కార్లను ఒక్కసారిగా స్టార్ట్ చేయవచ్చు.
- ఒక ఏనుగు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే నీటి యొక్క వాసనను కనిపెట్టగలదు.
- Ostriche పక్షి గుర్రం కంటే వేగంగా పరిగెత్తగలదు. అదే ఒక మగ ఆస్ట్రిక్ సింహం కంటే గట్టిగా గర్జించగలదు.
- తేళ్ళు ఆరు రోజుల వరకు గాలి పీల్చకుండా ఉండగలవు.
- జంతువుల్లో మనుషుల తర్వాత లాంగెస్ట్ మెమొరీ పవర్ ఉండేది ఒక్క డాల్ఫిన్స్ కి మాత్రమే.
- పంది చనిపోయిన తర్వాత కూడా 30 నిమిషాల వరకు దాని అవయవాలు పనిచేస్తూనే ఉంటాయి.
- ఒక సీతాకోకచిలుకకి 12,000 కళ్ళు ఉంటాయి.
- ఒక్క ఖడ్గం మృగం యొక్క కొమ్ము నిజానికి అది కొమ్మే కాదు, అది దాని శరీరంపై దృఢంగా పెరిగిన ఒక వెంట్రుక.
- ప్రపంచంలో అతి చిన్న విషపూరిత కప్ప ఒక సెంటీమీటర్ కన్నా చిన్నదిగా ఉంటుంది. దీని చర్మం ఎంత విషపూరితంగా ఉంటుందంటే, మార్ఫిన్ అనే విషం కన్నా 200% ఎక్కువ విషపూరితంగా ఉంటుంది. ఒక్కోసారి మనిషి దీన్ని చర్మాన్ని తాకిన కూడా చనిపోతాడు.
- కంగారు పుట్టినప్పుడు దాని పరిమాణం కేవలం ఒక అంగుళం మాత్రమే ఉంటుంది.
- గుర్రం నిలబడి కూడా నిద్రపోతుంది.
- ఒక సింహం 35 నుండి 45 అడుగుల దూరం దూకగలదు.
- కోతికి 36 పళ్ళు ఉంటాయి. కానీ మనిషికి మాత్రం 32 పళ్ళు మాత్రమే ఉంటాయి.
- కోతులు కూడా మనిషిలాగే అరటిపండు తొక్క తీసి అరటిపండు తింటాయి.
- కుక్కకి వాసన మరియు వినికిడి శక్తి మనిషి కంటే పది రెట్లు ఎక్కువగా ఉంటుంది.
- ప్రపంచంలోనే ప్రతి అడవిలో ఏకరా నికి 50,000 సాలె పురుగులు కనిపిస్తాయి.
- తిమింగలం గుండె ఒక్క నిమిషంలో తొమ్మిది సార్లు మాత్రమే కొట్టుకుంటుంది.
- వడ్రంగి పిట్ట అనుకుంటే ఒక్క సెకండ్ లో దాని పరిమాణం కంటే 20 రెట్లు పెద్దదిగా మారుతుంది.
- Armadillo అనే జంతువు యొక్క పొలుసులు చాలా బలంగా ఉంటాయి. అవి ఎంత బలంగా ఉంటాయి అంటే, బుల్లెట్ తో దాడి చేసినా కూడా తట్టుకునే విధంగా ఉంటాయి. ఈ కారణం చేత శత్రువుల నుండి ఇవి కాపాడుకుంటాయి.
- ఆక్టోపస్ ఒకసారి కి 56 వేల గుడ్లను పెడుతుంది. ఆక్టోపస్ పిల్లలు బియ్యం గింజంత సైజులో ఉంటాయి.
- నీలి తిమింగలాలు ఒకసారికి అర మిలియన్ కేలరీలకు సరిపడే ఆహార పదార్థాలని తినేస్తాయి.
- ఎలుకలు కూడా మనుషుల లాగే కలలు కంటాయి. అది ఏమని కలలు కంటయంటే, ఆహారాన్ని ఎలా సంపాదించుకోవాలి మరియు శత్రువుల నుంచి ఎలా తప్పించుకోవాలి అనే కలలు కంటాయి.
- ప్రపంచంలోనే వెనుకకు నడవలేని ఒకే ఒక జంతువు కంగారు.
- గుడ్లగూబ పక్షులు వాటి తలను 300 డిగ్రీలు తిప్పగలవు.
- సీతాకోకచిలుక వాటి కాళ్లతో టెస్ట్ అనేది తెలుసుకుంటుంది.
- నత్తలు నిరంతరంగా మూడు సంవత్సరాల వరకు నిద్రపోగలవు.
- జిరాఫీ ఎటువంటి శబ్దం చేయలేదు. దీనికి కారణం వాటి శరీరంలో vocal cords లేవు.
- జలగ 32 మెదడులను కలిగి ఉంటుంది. జలగ అంతర్గత నిర్మాణంలో 32 వేరు వేరు విభాగాలుగా విభజించబడి, ప్రతి భాగంలో ఒక మెదడు (Brain) 🧠 కలిగి ఉంటుంది.
- అత్యంత భారీ శరీరం కలిగిన ఏనుగు కూడా ప్రమాదం కలిగినప్పుడు గంటకి 39 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగలదు.
Super
ReplyDeletePost a Comment