Importance of Himalayas Telugu- హిమాలయాలకు ఉన్న గొప్ప ప్రాముఖ్యత తెలుసుకుందాం....

 హిమాలయాలు అంటే సంస్కృతంలో మంచుకు నిలువ అని  అర్థం వస్తుంది.    

               

  • ఈ హిమాలయాల్లో సుమారు వందకు పైగా శిఖరాలు ఉన్నాయి.
  • హిమాలయ శిఖరాలు 7200 మీటర్లు ఎత్తుకు మించి ఉంటాయి.        
                                         
  • పర్వత శ్రేణులు ప్రపంచంలోనే ఎత్తైనవి. వీటిల్లో ఎవరెస్ట్ మరియు కాంచన గంగ శిఖరాలు అత్యంత ఎత్తైనవి.
  • హిమాలయాలు ఆసియాలో (భూటాన్ ,చైనా, భారతదేశం ,నేపాల్, పాకిస్తాన్) దేశాలు వ్యాపించి ఉన్నాయి.
  • హిమాలయాల పరివాహక ప్రాంతంలో  1.3  బిలియన్ల జనాభా నివసిస్తుంది.     
                      
  • ప్రపంచంలోని అతి పెద్ద నదుల్లో సింధు, గంగ, బ్రహ్మపుత్ర వంటి నదులకు హిమాలయాలే వనరులు.
  • ఇవి చంద్రవంక ఆకారంలో 2,400కి.మీ. పొడవు మరియు 400 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి ఉన్నాయి.      
                                
  • హిమాలయాల్లో ఉండే ఎవరెస్టు శిఖరం 8488 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం గా పేరు పొందింది.
  • ఈ శిఖరం నేపాల్ మరియు టిబెట్ల సరిహద్దుల్లో ఉంటుంది. అందుకే ఈ శిఖరానికి ఆకాశ నుదురుగా పిలుస్తారు.     
                    


హిమాలయాల్లో సమాంతరంగా ఉండే మూడు పర్వత శ్రేణులు ఉన్నాయి.    

a. ఉత్తరాన "ఉన్నత హిమాలయాలు" లేదా "హిమాద్రి పర్వతశ్రేణి" ఉంది. ఇది పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ హిమాని నదులు కలవు .ఇవి జీవనదులు నీటిని అందజేస్తుంది. 


b. హిమాద్రి కి దక్షిణాన ఉన్న పర్వత శ్రేణిని "నిమ్న హిమాలయాలు" అంటారు. వీటిని "హిమాచల్" అని పిలుస్తారు. ఈ శ్రేణిలో "పీర్ పంజాల్" భారత శ్రేణులు కలవు.                                                   


c. హిమాలయాలకు తూర్పు సరిహద్దుగా "బ్రహ్మపుత్ర లోయ" ఉంది. భారతదేశానికి తూర్పు సరిహద్దుగా ఉన్న హిమాలయాలను "పూర్వాంచల్" అంటారు.                                                   

  • హిమాలయాల వల్ల భారత శీతోష్ణస్థితి అనేక విధాలుగా ప్రభావితం అవుతుంది. ఇది భారతదేశ ఉత్తర సరిహద్దులో రక్షణ కవచాలుగా ఉండి తీవ్ర చలికాలంలో మధ్య ఆసియా నుండి వచ్చే చల్లటి గాలుల్లో అడ్డుకుంటున్నాయి.
  • హిమాలయాల నదులు జీవ నదులు. గంగా ,సింధు, బ్రహ్మపుత్ర ,నదుల్లో వాటి ఉపనదులు వల్ల ఈ ప్రాంతం అత్యంత సారవంతమైన మృత్తికలు ఆహారం నగదు వంటి పండటానికి ఉపయోగకరంగా ఉంది.                               
  • పూర్వకాలంలో శత్రువుల దేశాల నుండి భారతదేశం కాపాడుకోవడానికి హిమాలయాలు ప్రధాన కారణం అని చెప్పవచ్చు.
  • హిమాలయాల పర్వతాలు జమ్మూ కాశ్మీర్ నుండి అరుణాచల్ ప్రదేశ్ 2,400 కిలోమీటర్లు పొడవున ఒక చేప వలే విస్తరించి ఉన్నాయి. అయితే హిమాలయాల వెడల్పు అనేది ప్రాంతంలోని బట్టి మారుతూ ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్ లో 200 కిలోమీటర్ల వెడల్పు, జమ్మూకాశ్మీర్లో 500 కిలోమీటర్లు వెడల్పు ఉన్నాయి.         
           

హిమాలయాలు మొత్తం 5 లక్షల కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి.
  • హిమాలయాలలో దొరికే వనమూలికలు చాలా శక్తివంతమైనవి. భారతదేశ ఆయుర్వేద మందుల్లో పారిశ్రామికలో మూలికలను అందించే పెన్నిధిగా హిమాలయ ప్రాంతం పేరుగాంచింది.                                           
  • శాస్త్రవేత్తలు భూమిని పరిశోధించి చాలా ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తెచ్చారు. అవేమిటంటే ఇప్పటిదాకా మనమంతా హిమాలయ పర్వతాలు సుమారు 80 లక్షల సంవత్సరాల క్రితం పుట్టాయని భావిస్తూ వస్తున్నాం. అయితే అది తప్పని 139 నుంచి 144 లక్షల సంవత్సరాల క్రితమే హిమాలయాలు పుట్టినట్లు తాజా పరిశోధనలు ద్వారా వారు కనుగొన్నారు.                            


  • కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మన భూమి మీద ఖండాలు ఇప్పట్లో లాగా ఉండేవి కావు అవన్నీ కలిసి దగ్గర దగ్గరగా ఒకే చోట ఉండేవి అయితే అవి నెమ్మదిగా దూరంగా జరుగుతూ సుమారు 15 కోట్ల సంవత్సరాల క్రితం రెండు మహాకండాలుగా విడిపోయాయి
  • వాటిని "గోండ్వానా ల్యాండ్",        "లారసియా  "అని పిలుస్తారు ఇప్పటికీ మన భారత భూభాగంలో అప్పట్లో "గోండ్వానా ల్యాండ్ "లో ఒక చిన్న ముక్కలాగా ఉండేవి.  ఆ చిన్న ముక్కలు లక్షలాది సంవత్సరాల పాటు నెమ్మదిగా జరుగుతూ ,జరుగుతూ... ఇప్పటికీ ఆసియాలో ఉండే మరో ముక్కల్లా ఉండే భూభాగాన్ని ఢీ కొట్టింది అలా ఢీకొన్న చోటనే హిమాలయాల పర్వతాలు పైకి పొడుచుకొని ఉన్నాయి. ఈ రకంగా హిమాలయ పర్వతాలు పుట్టినాయి.     


మనకు ఉపయోగపడే అనేక విషయాలు తెలుసుకోవాలంటే ప్రతిరోజూ మా బ్లాగ్ సందర్శించండి.




             

3 Comments

Post a Comment

Previous Post Next Post