మనం చేసే ప్రతి పనిలో ఆలోచనలో కూడా ఆరా మనకు తోడుగా ఉంటుంది. ఈ ఆరా మనం ఎన్నో సంవత్సరాలుగా మనిషి చేసే పాజిటివ్ లేదా నెగిటివ్ పనుల ద్వారా నియమితమై ఉంటుంది. మనం చాలా సంవత్సరాలుగా పాజిటివ్ ఆలోచనలతో ఉంటే మన ఆరా కూడా పాజిటివ్ గా ఉంటుంది.
మనిషి ఎటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పటికీ పాజిటివ్ గా ఉండడానికి ప్రతి ఒక్కరికి ఈ ఆరా అనేది ఉపయోగపడుతుంది. మనిషి యొక్క స్వభావాన్ని బట్టి తన చుట్టూ కాంతి వలయం అంటే ఆరా ఆవరించి ఉంటుంది.అయితే యోగ శాస్త్రంలో ఆరితేరిన వారికి మాత్రమే మనిషి చుట్టూ ఉండే ఆరా చూడగలుగుతారు. ప్రతి మనిషిలో కూడా వైబ్రేషన్ వస్తాయి. ఈ వైబ్రేషన్స్ మనిషి చుట్టూ మాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడడానికి కారణమవుతాయి. మనం ఇప్పుడు ఫిజికల్ గా వర్క్ చేయగలుగుతున్నాము అంటే దానికి కారణం మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఎలక్ట్రో కెమికల్ రియాక్షన్ అని చెప్పవచ్చు. మన బాడీ లో ఉన్న ఎలక్ట్రికల్ పవర్ మరియు మ్యాగ్నెటిక్ పవర్ కలిసి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పవర్ తయారవుతుంది. ఒక మనిషి చుట్టూ ఉండే ఎలక్ట్రికల్ ఫీల్డు నే ఆరా అంటాము.
ఆరా నుంచి వచ్చే లైట్ మనం చూడలేము. మన కళ్ళు కొన్ని లైట్స్ చూసే కెపాసిటి కోల్పోయి ఉంటుంది. ఆరా అనేది సాధారణంగా సాధారణ మనిషి అయితే మన శరీరం నుంచి మూడు నాలుగు అడుగుల ఎత్తులో ఉంటుంది. అదేవిధంగా సాధువులు, మునులు, ఋషులు ఉన్నట్లయితే 40 నుండి 42 అడుగుల దూరం ఉంటుంది. మనిషి యొక్క ఆరా అనేది వారి వారి ఆలోచనలను బట్టి ఏర్పడుతుంది. ఇంకా అది అప్పుడప్పుడు మారుతూ కూడా ఉంటుంది. ఆరా అనేది మనుషులకు మాత్రమే కాదు చెట్లకు, జంతువులకి, పక్షులకు కూడా ఉంటుంది. ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి చుట్టూ వారి వారి స్వభావాన్ని బట్టి ఆరా ఛాయలు అలుముకొని ఉంటాయి. ఒక వ్యక్తి చుట్టూ అలుముకొని ఉన్న ఆరాను బేస్ చేసుకుని అతని స్వభావాన్ని తెలుసుకోవచ్చు.ఒక వ్యక్తి చుట్టూ బ్లూ కలర్ ఆరా ఉన్నట్లయితే ఆ వ్యక్తి మేధావి అయి ఉంటాడు. డార్క్ బ్లూ కలర్ ఉన్నట్లయితే అనుమానాస్పద స్వభావం కలిగి ఉంటాడు. డార్క్ కలర్ ఉన్నట్లయితే ఆ వ్యక్తి అత్యంత ప్రమాదకరమైన దృష్టుడు మరియు క్రూరమైన స్వభావం కలిగి ఉంటాడు. గోధుమ రంగు అంటే చుట్టుపక్కల వారిని పట్టించుకోని వాడు మరియు వారి గురించి ఆలోచించని వాడు అయి ఉంటాడు. పచ్చని బంగారు రంగులో ఉంటే మంచి లక్షణాలను కలిగి ఉంటాడు. బూడిద రంగులో ఉన్నట్లయితే భయస్తుడు అలిసిపోయిన వాడు అయి ఉంటాడు. ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటే నమ్మకద్రోహి మరియు అసూయపరుడై ఉంటాడు. ఉంటాడు స్పష్టమైన ఆకుపచ్చ రంగులో ఉంటే రాగద్వేషాలకు అతీతంగా ప్రశాంత పరుడై ఉంటాడు. కాషాయం రంగులో ఉంటే శారీరకంగా బలంగా ఉంటారు. ఎరుపు రంగు ఉంటే పరిపూర్ణమైన శక్తిని కలిగి ఉంటాడు. వెండి రంగులో ఉంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అయి ఉంటాడు. పసుపు రంగులో ఉంటే నిత్యసంతోషి మరియు దయా హృదయం కలవాడై ఉంటాడు. గులాబి రంగులో ఉన్నట్లయితే సేవా దృక్పథం కలిగి ఉంటాడు. ఆరా అనేది ప్రతి ఒక్కరి లో ఉంటుంది. దీనిని కనపడని శక్తి అంటారు.
Post a Comment