బాబర్ 1530 వ సంవత్సరంలో తన కుమారుడు అయినటువంటి హుమాయున్ ను తన సామ్రాజ్య వారసుడిగా పట్టాభిషేకం చేసి అతనికి ఎంతో ఇష్టమైన కోహినూర్ వజ్రాన్ని కూడా ఇస్తాడు. హుమయున్ తన తండ్రి ఇచ్చిన కోహినూరు వజ్రాన్ని కంటికి రెప్పలా చూసుకుంటాడు. తన వద్ద కోహినూర్ వజ్రం ఉందని తెలిస్తే ఇతర రాజులందరూ యుద్ధానికి వస్తారు అని భావించిన హుమయున్ తన రాజ్యాన్ని రాజస్థాన్ కి మార్చుకొని అక్కడికి వెళ్ళిపోతాడు. రాజస్థాన్ కి వెళ్లిపోయిన తర్వాత కూడా అక్కడ ఒక సంవత్సరం పాటు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాని తర్వాత కోహినూరు వజ్రం గొప్పతనం గురించి తెలుసుకున్నా మహదేవ్ రాథోర్ అనే రాజు యుద్ధం చేసి యుద్ధంలో హుమాయూన్ ని ఓడిస్తాడు. మల్ దేవ్ రాథోర్ మార్వర్ సంస్థానానికి రాజుగా ఉండేవాడు. యుద్ధంలో ఓడిపోయిన హుమయున్ తప్పనిసరి పరిస్థితులలో తన దగ్గర ఉన్న కోహినూర్ వజ్రాన్ని మాల్ దేవ్ రాథోర్ రాజుకి అప్పగిస్తాడు.
దీని తర్వాత మళ్లీ కోహినూర్ వజ్రాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఢిల్లీ సుల్తానులు మాల్ దేవ్ రాథోర్ పైకి యుద్ధానికి వస్తారు. యుద్ధంలో రాజా మాల్ దేవ్ ని ఓడించి తన రాజ్యాన్ని తో పాటు కోహినూర్ వజ్రాన్ని కూడా ఢిల్లీ సుల్తానులు వంశం చేసుకుంటారు. కోహినూరు వజ్రం తిరిగి మళ్ళీ ఢిల్లీ సుల్తాన్ల చేతుల్లోకి వచ్చింది అని తెలుసుకున్న నాదర్ షా అనే రాజు ఈ వజ్రాన్ని సొంతం చేసుకోవాలని ఎన్నో కలలు కంటాడు. అయితే అప్పటికే ఈ కోహినూరు వజ్రం చాలామంది ఢిల్లీ సుల్తానుల చేతులు మారుతూ మహమ్మద్ షా అనే ఢిల్లీసుల్తాన్ చేతిలోకి వస్తుంది. ఈ విషయం తెలుసుకున్న నాదర్ షా, మహమ్మద్ షా గురించి గాలింపు మొదలు పెట్టి మహమ్మద్ షా దగ్గర కోహినూర్ డైమండ్ తో పాటు నెమలి సింహాసనం వంటి విలువైన వస్తువులు ఉన్నాయని తెలుసుకుంటాడు. ఆ కాలంలో ఉన్న అన్నీ సింహాసనాలు నెమలి సింహాసనం చాలా విలువైనది. ఈ విషయాలన్నీ తెలుసుకొని నాదర్ షా మొగల్ సామ్రాజ్యం పై యుద్ధానికి వస్తాడు. నాదర్ షా తెలివిగా మొగల్ సామ్రాజ్యం చుట్టూ ఉన్న సైన్యాన్ని మొత్తం అంతం చేసేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న మహమ్మద్ షా మూడు లక్షల మంది సైనికులను ఏర్పాటు చేసుకొని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటాడు. 1739 ఫిబ్రవరి 13వ తేదీన మహమ్మద్ షా సైన్యానికి మరియు నా దర్ షా సైన్యానికి భారీ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో నాదార్ షా సైన్యం మహమ్మద్ షా సైన్యాన్ని మూడు గంటల్లోనే ఓడిస్తుంది. దీని తర్వాత నాదార్ షా సైన్యం రాజ్యంలో ఉన్న ఖజానా మొత్తం దోచుకుంటారు. విలువైన ఆభరణాలతో పాటు కోహినూర్ వజ్రాన్ని కూడా తీసుకెళ్ళిపోతారు. అప్పటినుండి కోహినూర్ డైమండ్ నాదర్ షా దగ్గరే ఉండి పోతుంది. కొంతకాలం తర్వాత నాదర్ షా చనిపోతాడు. అతను చనిపోయిన తర్వాత ఆ వజ్రం అతడి మనవడి దగ్గర ఉండిపోతుంది. నాదర్ షా మనవడు కోహినూర్ గురించి జరిగిన అనేక యుద్ధాల గురించి తెలుసుకొని ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ఆహారం ఏ ప్రాంతానికి చేరుకుంటడు. అక్కడికి చేరుకున్న తర్వాత తనకు రక్షణ కావాలని ఆఫ్ఘనిస్తాన్ సామ్రాజ్య స్థాపకుదు అహ్మద్ షా దుల్హన్ కు కోహినూరు వజ్రం అప్పగిస్తాడు. ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత అహ్మద్ షా దుల్హన్ దగ్గర ఉన్న డైమండ్ ను అతని వారసుడు సుజాషా తీసుకుంటాడు. ఒక సంవత్సర కాలం తర్వాత రష్యాకు మరియు ఆఫ్ఘనిస్తాన్ కు మధ్య యుద్ధం జరగబోతోందని భావించిన సుజాషా ఆఫ్ఘనిస్తాన్ వదిలేసి తన దగ్గర ఉన్న కోహినూర్ వజ్రాన్ని తీసుకుని పంజాబ్ లోని లోహర్ చేరుకుంటాడు. ఇతను అక్కడికి చేరుకున్న తర్వాత పంజాబ్ లోని సిక్కు సామ్రాజ్య స్థాపకుడు మరియు పంజాబ్ యొక్క రాజు అయినటువంటి రంజిత్ సింగ్ కు 1813 వ సంవత్సరంలో కోహినూరు వజ్రం గురించి తెలుస్తుంది. దాని గురించి తెలుసుకున్న తర్వాత రంజిత్ సింగ్ ఆ వజ్రాన్ని సుజషా దగ్గర నుంచి తీసుకొని తన సొంతం చేసుకుంటాడు. రంజిత్ సింగ్ ముసలివాడై అనారోగ్యంతో మరణించిన తర్వాత తన కుమారుడు అయినటువంటి దిలీప్ సింగ్ కోహినూర్ వజ్రం సొంతమవుతుంది.
తర్వాత కాలంలో కోహినూరు వజ్రం భారతదేశంలో బ్రిటిష్ ఆక్రమణ తరువాత ఇది బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. కోహినూరు వజ్రం పురుషులు ధరిస్తే దురదష్టం కలుగుతుందనే భావనతో ఈ వజ్రాన్ని బ్రిటిష్ రాజ కుటుంబంలోని మహిళలు మాత్రమే ధరించేవారు.
ప్రస్తుతం ఈ వజ్రం లండన్ టవర్ వద్ద ఉన్న జ్యువెల్ హౌస్ లో బహిరంగ ప్రదర్శన లో ఉంది. దీనిని ప్రతి సంవత్సరం లక్షల మంది సందర్శకులు సందర్శిస్తారు. 1947 లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత, భారతదేశం, పాకిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తన్ ప్రభుత్వాలు కోహినూర్ వజ్రం తమకే చెందుతుందని ప్రకటించాయి, తమకు ఈ వజ్రాన్ని తిరిగి ఇవ్వాలని కోరాయి. లాహోర్ చివరి ఒప్పందం నిబంధనల ప్రకారం రత్నాన్ని చట్టబద్ధంగా పొందినందుకు బ్రిటిష్ ప్రభుత్వం వాదనలను తిరస్కరించింది.
కోహినూర్ వజ్రం సంబంధించిన మరికొన్ని ముఖ్య విషయాలు
- కోహినూర్ వజ్రాన్ని బ్రిటిష్ రాజ కుటుంబంలో ఇంటి పెద్ద కోడలు కి వారసత్వ కారణంగా ఇస్తూ వచ్చేవారు.
- కోహినూరు వజ్రామే పురాణాల్లోని సమంతకమని కూడా నమ్మేవారు.
- బాబర్ చక్రవర్తి 186 క్యారెట్ల బరువైన కోహినూరు వజ్రం ఖరీదు ఎంత ఉంటుందంటే, ఈ వజ్రాన్ని అమ్మి నట్లయితే తే ఈ ప్రపంచానికంతా రెండున్నర రోజులు భోజనం పెట్టవచ్చు అని చెప్పేవాడు.
Post a Comment