ఒడిశాలోని డీఘా తీరంలో ప్రతి రోజు లాగానే జాలరులు చేపల వేట కోసం పడవలు వేసుకొని బయలుదేరారు. వెళ్లిన కాసేపటికే మనోరంజన్ దాస్ తాను విసిరిన వల్ల బరువు గా అనిపించింది. వలను లాగి చూశాక ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఒకటి రెండూ కాదు ఏకంగా 121 చేపలు అది తెలియాభోలా చేపలు పడ్డాయి. అతనికి అదృష్టం మత్స్య దేవత రూపంలో వచ్చింది. మార్కెట్ కి వెళ్లి వేలంపాట పెట్టాడు. సాయంత్రానికల్లా రెండు కోట్ల రూపాయలతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంతకీ ఆ చేపలు ఎందుకంత ఖరీదు... మొదలైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
తెలియభోలా చేపలు సముద్రాల్లో ఎక్కడ దొరికినా కూడా దాని ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది అరుదైనది, ఔషధ గుణాలు కూడా చాలా ఉంటాయి. అయితే అన్ని చేపలు ఒకేసారి పట్టడం ఈ మధ్యకాలంలో మనోరంజన్ దాస్ కి మాత్రమే సాధ్యపడింది. పైగా ఇతనికి దొరికిన ఒక్కొక్క చేప 18 కిలోల బరువు ఉండటంతో రెండు కోట్ల రూపాయల వరకు అమ్ముడుపోయాయి.
తెలియాభోలా చేపలు మందుల తయారీలో ఉపయోగిస్తారు
సాధారణంగా ఈ చేపల వెల పరిమాణాన్నిబట్టి కిలో 13 నుంచి 30 వేల రూపాయలు ఉంటుంది. అయితే ఈ జాలరికి దొరికిన చేప భారీ చేప కావడంతో 48 వేల రూపాయల వరకు ధర పలికింది. ఈ చేప తిత్తిలోని పోషకాలను మందుల తయారీలో వాడుతుంటారు. అందుకే విదేశాల్లో ఈ చేపలకు చాలా డిమాండ్ అని చేపల వ్యాపారులు చెబుతున్నారు.
క్రోకర్ జాతికి చెందిన తెలియాభోలానే సీ గోల్డ్, గోల్డ్ హార్టెడ్ ఫిష్, ఘోల్ చేప అని అంటారు. ఇది ఎవరి కైనా చిక్కినట్లయిటే అయితే ఆ జాలరి అదృష్టవంతుడు అవుతాడు. ఆ మధ్య మహారాష్ట్రలోని పాలగడ్ కు చెందిన మూసే గ్రామానికి చెందిన చంద్రకాంత్ ఇతర సభ్యులతో కలిసి వేటకి వెళ్ళినప్పుడు వల చాలా బరువుగా అనిపించిందట. ఎంతో ప్రయాస పడి దాన్ని బయటకు లాగగానే పడవలో ఉన్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఓకే సారీ 157 తెలియాభోలా చేపలు ఉన్నాయి. అంతే చంద్రకాంత్ ఆనందానికి అడ్డే లేదు. దాంతో అటు నుంచి అటే బేరం మాట్లాడుకుని 1.33 కోట్ల రూపాయలతో ఇంటికి తిరిగి వచ్చాడు. అలాగే బెంగాల్ కు చెందిన ఓ మత్స్యకారుల బృందానికి భారీ సైజులోని 33 తెలియాభోలా చేపలు చిక్కాయి. 84 కిలోల బరువున్న ఈ చేపల్ని కోల్ కతా కి చెందిన ఫార్మా కంపెనీ సొంతం చేసుకుని కోటి రూపాయలు ఇచ్చింది. ఇలా అప్పుడప్పుడు ఈ క్రోకర్ చేప జాలర్ల ఇంట కాసుల పంట కురిపిస్తూనే ఉంటుంది.
ఈ చేపల లోఎటువంటి పోషకాలు వుంటాయి?
ఈ చేపల్లో అయోడిన్, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రోటీన్లు, ఐరన్, మెగ్నీషియం, ఫ్లోరైడ్, సెలీనియం... ఇలా అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇందులోని బి5 విటమిన్ శరీరంలో పేరుకొన్న టాక్సిన్లు ను బయటకు పోవడానికి సహాయపడుతుంది. దీని కారణంగా హిమోగ్లోబిన్ తద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతాయి. 100 గ్రాముల క్రోకర్ చేపలో 15 మైక్రోగ్రాముల ఫోలిక్ ఆమ్లం ఉంటుంది. అలాగే బి12, డి- విటమిన్, ఇ-విటమిన్, కే-విటమిన్లు ఉంటాయి. ఇవన్నీ కలిసి హార్మోన్ల వ్యవస్థ ను సమతుల్యంగా ఉంచుతాయి. ఇందులోని కొలాజెన్ పదార్థం చర్మం ముడతలు పడకుండా, వృద్ధాప్యం అనేది రాకుండా కాపాడుతుంది. గర్భిణీలు ఈ చేపలు తింటే శిశువు మెదడు వృద్ధి బాగుంటుందని, తెలివితేటలు పెరుగుతాయని చెబుతారు. పులస చేప మాదిరిగానే రుచిగా కూడా ఉంటుంది. అయితే ఔషధ గుణాల రీత్యా ఫార్మా కంపెనీలు విక్రయించడంతో-అవి చేప పొట్టతిత్తినీ చర్మం లోని కొలాజెన్ పదార్థాన్ని తీసి మందు ల్లోనూ కాస్మోటిక్ తయారీలోను వాడి, మాంసాన్ని విడిగా విక్రయిస్తాయి. ఇటీవలి కాలంలో పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఈ చేపలు సముద్ర గర్భం లోకి వెళ్ళి పోతున్నాయని ఒక అధ్యయనం చెబుతోంది. ఈ చేపలు గనుక మత్స్యకారులకు దొరికినట్లయితే వారు కోటీశ్వరులు అయిపోవచ్చు.
Post a Comment