The highest achievers in the field of sports - క్రీడారంగంలో అత్యున్నత ఘనత సాధించిన పది వ్యక్తుల గురించి విషయాలు

 



నీరజ్ చోప్రా

జావెలిన్ త్రోల్లో నీరజ్ చోప్రా కు స్వర్ణ పథకం లభించింది. ఒలంపిక్ పథకం కోసం భారత్ వందేళ్ళ నిరీక్షణ ఫలించింది. నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచిన రెండో భారతీయుడుగా ఘనతను సాధించాడు. జాతీయ జావెలిన్ దినోత్సవంగా ఆగస్టు 7న ప్రకటించారు. ఆరోజున ఈ జాతీయ జావెలన్ దినోత్సవంగా జరుపుకోవాలని భారతీయ అథ్లెటీక్స్ సమైక్య నిర్ణయించింది. 


లవ్లీనా బోర్గో హైన్ కాంస్యం: 

టోక్యో ఒలంపిక్స్ 2020లో భారత మహిళా బాక్సర్  కాంస్య పథకం సాధించింది. టోక్యో ఒలంపిక్స్ లో భాగంగా 2021 ఆగస్టు 4న జరిగిన మహిళ బాక్సింగ్ పోటీలో సెమీఫైనల్స్ 69 కేజీల విభాగంలో బరిలో దిగిన లవ్లీనా 0-5 తో ప్రపంచ ఛాంపియన్ బేస్ సురమ్మ్ నీల్ (టర్కీ) చేతుల్లో ఓడిపోయి కాంస్యన్ని దక్కించుకుంది. దీంతో విశ్వ క్రీడల్లో విజయ విజయేంద్ర సింగ్, మేరీకోమ్ తర్వాత పథకం నెగ్గిన మూడవ బాక్సర్ గా లవ్లీనా ఘనత వహించింది.


నిశాద్ హైజంప్: 

పురుషుల ఆథలిక్   హైజంప్ హిమాచల్ ప్రదేశ్ కు చెందిన 21 ఏళ్ల నిశాద్ కుమార్ భారత్ కు రజత పథకాన్ని అందించారు. టీ-47 విభాగంలో నిశాద్ 2.06  మీటర్ల ఎత్తుకు ఎగిరి రెండో స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా ఆసియా రికార్డు కూడా నెలకొల్పాడు. వైస్ అమెరికా కూడా 2.06 మీటర్ల ఎత్తుకు ఎగరడంతో అతనికి కూడా రజతo లభించింది.


సుమిత్ ప్రపంచ రికార్డు: 


పురుషుల ఎఫ్ 64 విభాగంలో జావెలైన్ త్రోయర్ ప్రపంచ రికార్డు ప్రదర్శనతో పసిడి గెలిచాడు. 23 ఏళ్ల సుమిత్ తన ఐదోవ ప్రయత్నంలో ప్రపంచ రికార్డును తిరగరాస్తు 68.55 మీటర్ల దూరంకి విసిరాడు తన తొలి రెండు ప్రయత్నాలలో 66.95 మీటర్లు, 68.08 మీటర్లు అతడు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడం విశేషం. గత రికార్డులు (62.88)మీ కూడా అతని పేరిటే ఉంది.


శ్రీకాంత్ కు రజతం: 

స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆకట్టుకొని చివరికి రజతం గెలిచాడు. ఫైనల్లో శ్రీకాంత్ 15- 21, 20 - 22 లతో సింగపూర్లో చేతుల ఓడిపోయారు. ఫైనల్ లో ఓడిన ప్రపంచ ఛాంపియన్షిప్ లో రజతం సాధించిన తొలి భారతీయుడు పురుషుడు షట్లర్ గా శ్రీకాంత్ రికార్డుల్లోకి ఎక్కాడు.


మీరాబాయి ప్రపంచ రికార్డు:

 భారత్ స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో 49 కేజీల విభాగంలో క్లీన్ అండ్ జెర్కె లో 119 కేజీల ఎత్తి జియాంగ్( చైనా 118 కేజీల) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును ఆమె బద్దలు కొట్టింది. స్నాచ్  86 కేజీల లిఫ్ట్ చేసిన చాను మొత్తం మీద 205 కేజీలు ఎత్తి తన పేరిట ఉన్న ఓవరాల్ వెయిట్ జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. అంతేకాక కాంస్య పథకాన్ని కూడా గెలిచింది. 2021 వ ఫిబ్రవరి లో జరిగిన జాతీయ ఛాంపియన్షిప్ లో మీరాబాయి 203 కేజీలు 88 కేజీల స్నాచ్ 115 క్లీన్ అండ్ జర్క్ ఎత్తి రికార్డు నెలకొల్పింది.


 ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్:

 ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2021 పెరూ రాజధాని  లిమాలొ జరిగింది. ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత్ తొలి స్థానంలో నిలిచింది. టోర్నీలో ఏకంగా 13 స్వర్ణాలు 11 రజతాలు 6 కాంశాలతో మొత్తం 30 పథకాలు సాధించిన భారత పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. 

ఆర్చరీ ఛాంపియన్షిప్ లో జ్యోతి సురేఖ:


 అమెరికాలోని యంగ్టన్ వేదికలో జరిగిన ప్రపంచ ఆర్చరీ చాంపియన్షిప్లో భారత క్రీడాకారిని వేనం జ్యోతి సురేఖ మెరిసింది. 2021 వ సెప్టెంబర్ 25న జరిగిన కాంపౌండ్ విభాగంలో జ్యోతి సురేఖ భారత్ కు  మూడు రజిత పథకాలను అందించింది. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన 25 ఏళ్ల జ్యోతి సురేఖ కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో,  మిక్సిడ్ విభాగంలో, మహిళల టీం విభాగంలో రన్నరప్ గా నిలిచింది. 


ప్రపంచంలో జరిగే అనేక విషయాలు, మానవులకు ఉపయోగకరమైన విషయాలను తెలుసుకోవడానికి ప్రతి రోజు మా బ్లాగ్ ని అనుసరించండి.




Post a Comment

Previous Post Next Post