Surprising facts about humans - మానవుని గురించి తెలుసుకోవలసిన ఆశ్చర్యకరమైన విషయాలు

 

  •  సాధారణంగా మనకు ఏదైనా కొత్త విషయం అలవాటు కావడానికి 21 రోజులు పడుతుంది.
  • సగటు మనిషి మెదడు 30 శాతం సమయము ఏవో ఆలోచనలతో అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది.
  • ఈ మెదడు కొత్త విషయాన్ని అర్థం చేసుకోవడానికి దాన్ని కొన్ని భక్షాలుగా విభజిస్తుంది. ఉదాహరణకు ఎవరిదైనా పది అంకల మొబైల్ నెంబర్ను గుర్తుపెట్టుకోవడానికి మనం దానిని మూడు లేదా నాలుగు అంకెలుగా విభజిస్తూ ఉంటాము తెలుసు కదా.
  • మనిషి చనిపోయే ముందు జరిగే ఏడు నిమిషాల నాడీ సంబంధిత కార్యకలాపాలలో తన జీవితాంతం గురించి మొత్తం జ్ఞాపకాలు ఒకే కల లాగా కనిపిస్తాయి.
  • మనిషి ఏడ్చినప్పుడైనా ఎక్కువ నవ్వినప్పుడైనా కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తాయని తెలుసు కదా. అయితే ఆనందంతో కంటతడి పెట్టినప్పుడు మొదట కుడి కంట నుంచి అదే బాధలో ఏడ్చినప్పుడు మొదట ఎడమ కంటి నుంచి నీళ్లు వస్తాయి.
  • ఒక నెగిటివ్ విషయం విన్నప్పుడు మన మెదడులో సుమారు 5 పాజిటివ్ జ్ఞాపకాలు దెబ్బతింటాయి.
  • కొందరు వ్యక్తులకు ఒంటరిగా ఉండటం అంటే ఇష్టం. అయితే ఇలా ఇంట్లో ఎక్కువ కాలం పాటు ఒంటరిగా ఉండటం చాలా ప్రమాదకరమని తేలింది. రోజుకు 15 సిగరెట్లు కాల్చెంత ఆరోగ్యానికి కలిగే ప్రమాదంతో ఇది సమానం.
  • వ్యక్తి మిమ్మల్ని కనీసం 20 సెకండ్ల పాటు కౌగిలించుకుంటే మీలో హార్మోన్లు వృద్ధి చెంది ఆ వ్యక్తి పై నమ్మకం కలిగేలా చేస్తుంది.
  • అమ్మాయిలు చిన్నవయసులోనే మాట్లాడడం సెంటెన్స్ ను ఫ్రేమ్ చేసుకోవడం నేర్చుకుంటారు. కానీ మగపిల్లలకు ఈ విషయంలో కాస్త టైం పడుతుంది ఇందువల్ల మహిళలు ఎక్కువగా మాట్లాడడానికి ఇది ఒక కారణం.
  • ఆరోగ్యంగా ఉండటానికి ఫిజికల్ టచ్ చాలా ఉపయోగపడుతుంది అధ్యయనాలు నిరూపించాయి కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం, కలిసి ఉండటం ,వల్ల ఒత్తిడి తగ్గి ఇమ్యూనిటీ పెరుగుతుంది.
  • ముద్దు పెట్టుకోవడం, అరటి పండ్లు, తినటం చాక్లెట్లు తినడం, చూయింగ్ గమ్ తినడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్ పెరుగుతుంది.
  • మనం పుట్టినప్పుడు కళ్ళు ఎంత పరిమాణంలో ఉంటాయో మనం పెరిగినా కూడా అంతే సైజులో ఉంటాయి అదే చెవులు, మోకాలు, ముక్కు, మనతోపాటు కొంత వయసు వరకు పెరుగుతుంది.
  • స్నానం చేస్తూ పాటలు పాడడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంతేకాదు ఒత్తిడి తగ్గించి, బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేసి, మనసు ఆరోగ్యంగా ఉంటుంది.
  • ఏ ఒక్క అమ్మాయి తన మనసులో రహస్యాన్ని 47 గంటలకంటే ఎక్కువగా దాచుకోలేదు.


ప్రపంచంలో జరిగే అనేక విషయాలు, మానవులకు ఉపయోగకరమైన విషయాలను తెలుసుకోవడానికి ప్రతి రోజు మా బ్లాగ్ ని అనుసరించండి.





Post a Comment

Previous Post Next Post