స్వాతంత్ర్యానికి పూర్వం భారత ఆర్థిక వ్యవస్థ -Pre-independence Indian economy


  • ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్యం కోసం మనదేశంలో క్రీ.శ. 1600లో ప్రవేశించింది.
  • 1757లో జరిగిన ప్లాసీ యుద్ధం తో తూర్పు ఇండియా కంపెనీ భారతదేశం మీద రాజకీయ ఆధిపత్యాన్ని సంపాదించింది.
  • తూర్పు ఇండియా కంపెనీ భారత దేశాన్ని 1858 వ సంవత్సరం వరకు, సుమారు వంద సంవత్సరాలు పాలించింది.
  • బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం పై ఉన్న అధికారాన్ని తూర్పు ఇండియా కంపెనీ నుండి 1858 లో తీసుకుంది.
  • బ్రిటిష్ ప్రభుత్వ పాలనలో భారతదేశం 1947 ఆగస్టు 15 వరకు ఉంది.
  • భారతదేశం బ్రిటిష్ వలస పాలనలో క్రీ.శ. 1757 నుండి క్రీ.శ. 1947 వరకు సుమారు రెండు వందల సంవత్సరాలు ఉంది.
  • బ్రిటిష్ పాలన వల్ల మన దేశంలో కుటీర, చేతి వృత్తులు పరిశ్రమలు క్షీణించడం జరిగింది.
  • జమీందారీ వ్యవస్థకు దారి తీసిన బ్రిటిష్ వారి భూమి శిస్తు విధానం - శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి.
  • శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి 1793 లో బెంగాలులో ప్రవేశపెట్టబడింది.
  • సంపద తరలిపోవడం సిద్ధాంతాన్ని ప్రముఖ ఆర్థిక రాజనీతి వేత్త దాదాబాయి నౌరోజి సంపద, మూలధనం బ్రిటన్ కు తరలి పోవడం వల్ల భారతదేశంలో అభివృద్ధి జరగలేదని ప్రతిపాదించింది.
  • 18 వ శతాబ్దంలో భారత దేశ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గా ఉండేది.
  • 18వ శతాబ్దంలో భారతదేశం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డానికి కారణం వస్త్ర వ్యాపారం.
  • 18వ శతాబ్దంలో అభివృద్ధి చెందిన నౌకా రవాణా వల్ల భారత దేశాన్ని "మిస్ట్రెస్ ఆఫ్ ఈస్టరన్ సీస్" అనేవారు.
  • బ్రిటిష్ పాలన అంతం నాటికి భారతదేశంలో వ్యవసాయేతర రంగంలో ప్రధాన వృత్తి - సేవారంగం.
  • బ్రిటిష్ పాలనలో భారతదేశం మీద దేశం గా మారటానికి గల ప్రధాన కారణం వృత్తులలో మార్పు, విదేశీ వ్యాపారం.
  • బ్రిటిష్ పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ వెనుకబడి ఉండడానికి ప్రధాన కారణాలు - రాజకీయ కారణాలు, ఆర్థిక కారణాలు, సాంఘిక కారణాలు.
  • ప్రస్తుత కాలంలో భారత దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పిలుస్తున్నారు.
  • బ్రిటిష్ పాలనలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను వలస ఆర్థిక వ్యవస్థ అని పిలిచేవారు.

బ్రిటిష్ పరిపాలనా కాలం కంటే ముందు భారత ఆర్థిక వ్యవస్థ


  • బ్రిటిష్ వారు రాక పూర్వం భారతదేశంలో "స్వయం సంపూర్ణ గ్రామీణ సామూహిక ఆర్థిక వ్యవస్థతో కూడిన గణతంత్ర రాజ్యాలు ఉండేవి.
  • గ్రామ ప్రజలు వ్యవసాయదారులు, వృత్తి పని వాళ్ళు - దాసులు, గ్రామ అధికారులు అను మూడు వర్గాలుగా ఉండేవారు.
  • ఈ మూడు వర్గాల ప్రజలు గ్రామానికి ఆర్థిక అవసరాలను తీర్చడానికే కాకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి సరిపోయినంత గా వివిధ వస్తువులను ఉత్పత్తి చేయగలిగేవారు.
  • పట్టు ఉన్ని, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, కుంకుమ పువ్వు వంటి సుగంధ ద్రవ్యాలు, రంగుల అద్దకం లో ఉపయోగించే నీలి మందు, ముసాంబరం లేదా అతిమధురం (లైకోరైస్) వంటివి ఇలాంటి ఎగుమతులలో ముఖ్యమైనవి.
  • 17, 18 శతాబ్దాలలో భారతదేశం యూరప్ దేశాలకు అత్యధికంగా సరుకులను ఎగుమతి చేసేది.

బ్రిటిష్ పరిపాలన కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ


  • బ్రిటిష్ వారు భారతదేశాన్ని జయించిన కాలంలోనే ఇంగ్లండ్, తదితర యూరోపియన్ దేశాలలో పారిశ్రామిక విప్లవం సంభవించింది.
  • పారిశ్రామిక విప్లవం ద్వారా భారీ స్థాయిలో వసూత్పతి సాధ్యమయింది. ఈ వస్తువులు చవకగా లభించడం వలన యంత్రాల ద్వారా తయారైన వస్తువులకు డిమాండ్ పెరిగింది.
  • ఈ యంత్రం ఉత్పత్తికి కావలసిన ముడి పదార్థాల కోసం ఇంగ్లండ్ లాంటి దేశాలు తాము జయించిన దేశాలపై ఆధారపడ్డ సాగాయి.
  • ఈ కారణం చేతనే భారతదేశ ఆర్థిక వనరులను, వస్తు సంపదలను సహజ సంపదలను బ్రిటిష్ పాలకులు నిరంతరాయంగా దోచుకున్నారు. ఈ దోపిడీ వల్ల భారత దేశ స్థూల జాతీయ ఆదాయానికి, జాతీయ సంపదకు శాశ్వత నష్టం సంభవించింది.
  • భారత దేశం స్వాతంత్రం పొందేవరకు ఈ దోపిడి వివిధ రూపాలలో జరిగింది. డిఆర్ గాడ్గిల్ దీనిని 'ఆర్థిక పేల్చివేత' (ఎకనామిక్ డ్రైన్) గా పేర్కొంటే, దాదాబాయి నౌరోజీ 'ఆర్థిక సంపదను కొల్లగొట్టడం' (ఎకనామిక్ ఫ్లండర్) గా పేర్కొన్నారు.
  • ఈ పద్ధతుల పర్యవసానంగా భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గి, వ్యాపార పంటల ఉత్పత్తి పెరిగింది.
  • చేతివృత్తులు నశించాయి. యంత్ర సామాగ్రి ద్వారా ఉత్పత్తి అయిన వస్తువులకు గిరాకీ పెరిగింది.
  • చివరగా దేశ ఆర్థిక వ్యవస్థ నశించిపోయే స్థితి కలిగింది.

బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో భారతదేశం వలస ఆర్థిక వ్యవస్థ


  • మాతృ దేశ ప్రయోజనాల కోసం ఇతర దేశాలని ఆర్థికంగా దోచుకోవడం వలస ఆర్థిక వ్యవస్థ లక్షణం. ఈ క్రింది కారణాల వల్ల బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో భారత దేశం ఒక వలస ఆర్థిక వ్యవస్థగా ఉండేదని తెలుపవచ్చు.
  • భారతదేశ ఆర్థిక వనరులను, వస్తు సంపదను, ప్రాకృతిక ఆవాసాన్ని బ్రిటిష్ వారు నిరంతరంగా దోచుకున్నారు.
  • ఆ కాలం నాటి ప్రముఖ ఆర్థికవేత్తలు అందరూ కలిసి  భారతదేశ ఆర్థిక వ్యవస్థ రుగ్మతలను బ్రిటిష్ దోపిడీ పాలనే కారణమని తేల్చిచెప్పారు.
         ఉదా : ఈ దోపిడీని డిఆర్ గాడ్గిల్ 'ఆర్థిక పీల్చివేత'గాను, దాదాబాయి నౌరోజి 'ఆర్థిక సంపదను కొల్లగొట్టడం'గాను వర్ణించారు.
  • ఈ దోపిడి అనేక రూపాలలో పద్ధతులలో జరిగింది. వీటిలో బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన నూతన భూ ఒడంబడికలు, రైల్వే - రవాణా రంగాలు, పారిశ్రామిక విధానాలు ఉన్నాయి.
  • బ్రిటిషు వారు భారత వ్యవసాయాన్ని కూడా తీవ్రంగా దెబ్బ తీశారు. ఆహార పంటలకు బదులుగా వాణిజ్య పంటలు పండించేలా నిర్బంధం చేశారు. ఇందువల్ల ఎన్నో కరువు, కాటకాలు కూడా సంభవించాయి.
  • బ్రిటిష్ వారు తమ పరిశ్రమల బాగుకోసం భారతదేశంలోని చేతివృత్తులను కోలుకోని విధంగా దెబ్బతీశారు. ఇలా తమ స్వీయ ప్రయోజనాల కోసం బ్రిటీష్ వారు భారతదేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టి నందున బ్రిటిష్ వారి కాలంలో భారత్ ఒక వలస ఆర్థిక వ్యవస్థగా ఉండేదని చెప్పవచ్చు.
                
                  7tvnews.in

Post a Comment

Previous Post Next Post