ఈజిప్ట్ దేశం ఆఫ్రికా ఖండంలోని ఒక ప్రాచీన దేశం. పురాతన ఈజిప్టు అనేది ఉత్తర ఆఫ్రికాకు చెందిన ఒక అతి ప్రాచీన నాగరికత. నైలు నది దిగువ పరివాహప్రాంతంలో ఈ నాగరికత వెలిసింది.
ఈజిప్ట్ లో వేల సంవత్సరాల క్రితం నిర్మించిన పిరమిడ్లు ప్రపంచ ప్రసిద్ధి గాంచినవి. ఈజిప్ట్ అధికారికంగా పిలవబడే పేరు అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్, దీని వైశాల్యం సుమారు 10,10,000 చదరపు కిలోమీటర్లు.
ఆఫ్రికా మిడిల్ ఈస్ట్ లోని అధిక జనాభా గల దేశాలలో ఈజిప్టు ముఖ్యమైనది. 7.6 కోట్ల జనాభాలో ఎక్కువ భాగం నైలు నది ఒడ్డున నివసిస్తున్నారు. ఈ నైలునది సుమారు 40 వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యం విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. అక్కడే వ్యవసాయానికి అనుకూలంగా సాగు భూమిని కనుగొన్నారు. ఈజిప్ట్ లో ఉన్న సహారా ఎడారిలో ప్రజలు ఎక్కువగా నివసించరు. ఈజిప్టు జనాభాలో సుమారు సగభాగం పట్టణ ప్రాంతంలో నివసిస్తున్నారు.
ప్రపంచ దేశాలలో సుదీర్ఘ చరిత్ర కలిగిన దేశాలలో ఈజిప్టు ప్రధానమైనది. ఈజిప్టు అధికారిక మొత్తం ఇస్లాం, అధికారిక భాష అరబిక్. 95 మిలియన్ల మంది ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. ఆఫ్రికాలో మూడవ అత్యంత జనసంఖ్య కలిగిన (నైజీరియా, ఇథియోపియా తర్వాత) దేశంగాను ఉంది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో 15వ స్థానంలో ఉంది. 2016 ఈజిప్టు దక్షిణాఫ్రికాను అధిగమించి, నైజీరియా తర్వాత ఆఫ్రికా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది.
ఈజిప్ట్ దేశం గురించి ఆశ్చర్యపోయే విషయాలు
- ఈజిప్టు దేశ రాజధాని కైరో నగరం. ఇదే ఈజిప్ట్ లోని అతిపెద్ద నగరం కూడా. గత వెయ్యి సంవత్సరాలకు పైగా ఈజిప్టు రాజధాని గా కైరో పనిచేస్తుంది.అయితే కైరో నగరం అత్యధిక జనాభాను కలిగి భారీ రద్దీ ప్రదేశంగా మారిపోవడంతో ప్రభుత్వ ఈ కైరో నగరానికి తూర్పున 45 కిలోమీటర్ల దూరంలో కొత్త రాజధాని నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతం ఈ నగరానికి ఎటువంటి అధికారిక పేరు పెట్టలేదు.
- ఈ దేశ డబ్బుని ఈజిప్షియన్ పౌండ్స్ అని పిలుస్తారు. వీరి యొక్క పౌండ్ వచ్చి మన ఇండియన్ కరెన్సీ లో ప్రస్తుతం 4.80 (నాలుగు రూపాయల 80 పైసలు) ఇండియన్ రుపీస్ గా ఉంది.
- మతం పరంగా చూస్తే ఈజిప్ట్ ఒక ముస్లిం దేశం. ఈ దేశం 90.3% ముస్లింలే ఉన్నారు. వీరిలో ముఖ్యంగా సున్నీ ముస్లింలు ఎక్కువ ఉన్నారు. ఆ తర్వాత 9.6% క్రిస్టియన్స్ ఉన్నారు. మిగిలిన మిగిలిన 0.01% ఇతర మతాల ప్రజలు జీవిస్తున్నారు.
- ఈజిప్టు దేశ అధికారిక భాష అరబిక్. దేశంలో ఉన్న ఎక్కువ మంది ప్రజలు అరబిక్ భాషనే ఉపయోగిస్తారు. ఆ తర్వాత స్థానంలో ఎక్కువగా ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ భాషలను ఉపయోగిస్తారు.
- ఈజిప్ట్ దేశంలో అక్షరాస్యత మిగతా దేశాలతో పోలిస్తే వెనుకబడి ఉందని చెప్పవచ్చు.
- ఈజిప్ట్ దేశానికి మరియు భారత దేశానికి మధ్య ఉన్న సమయ వ్యత్యాసం కేవలం 3:30 నిమిషాలు మాత్రమే. అంటే ఈజిప్ట్ లో ఉదయం 9:00 అయితే తే మనదేశంలో సమయం 12:30 అవుతుంది.
- జనాభా పరంగా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన 14 వ దేశంగా ఈజిప్ట్ నిలిచింది.
- ఈజిప్ట్ జెండా మూడు రంగులు కలిగిన సమాంతర చారలతో ఉంటుంది. వీటిలో ఎరుపు రంగు అనేది ఈ దేశ అమరవీరుల త్యాగాలను, రక్తాన్ని సూచిస్తుంది. తెలుపు రంగు అనేది శాంతిని సూచిస్తుంది. మూడవది నలుపు రంగు అనేది చీకటి కాలాన్ని సూచిస్తుంది. మధ్యలో ఉన్న డేగ వీరి బలం మరియు శక్తిని సూచిస్తుంది.
- పూర్వకాలంలో ఈజిప్టు వారు పిల్లులను పవిత్ర జంతువుగా భావించే వారు. ఈ జంతువు వారి ఇంటికి అదృష్టాన్ని తెస్తుందని నమ్మేవారు. ప్రతి కుటుంబంలో కూడా పిల్లిని పెంపుడు జంతువుగా పెంచుకునేవారు.
- ప్రపంచంలోనే అతి పొడవైన నది నైలు నది. ఇది ఈజిప్టు దేశం లోనే ఉంది. ఈ నది లేకపోయినట్లయితే ఈజిప్టు మొత్తం ఒక ఎడారిలా గా మిగిలిపోయేది. ఎందుకంటే ఇక్కడ వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది.
- మమ్మీల సమాధి తర్వాత మనం చెప్పుకోవాల్సినవి ఇక్కడ ఉన్న పిరమిడ్ల గురించి. ఈ పిరమిడ్లు అనేవి ఈజిప్టు పరిపాలించిన రాజులు మరియు వారి కుటుంబ సభ్యుల సమాధి కోసం నిర్మించబడ్డాయి. వీరు చనిపోయాక శరీరంతోపాటు వీరి దగ్గర ఉన్న నిధిని కూడా ఇక్కడ దాచి పెట్టేవారు. ఇది వీరి మరణం తర్వాత వచ్చే జీవితంలో ఉపయోగ పడుతుందని నమ్మేవారు.
- ఈజిప్ట్ లో ఇప్పటివరకు 130కి పైగా పిరమిడ్లను కనుగొన్నారు. పురావస్తు శాఖ వారు ఇంకా మరికొన్ని పిరమిడ్లు కనుగొనడానికి పరిశోధనలు సాగిస్తున్నారు.
- ఇక్కడ ఉన్న అన్ని పిరమిడ్లలో గ్రేట్ పిరమిడ్ అనేది చాలా పెద్దది. దీని నిర్మాణం కోసం లక్ష మంది కూలీలు పని చేశారు. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఈ పిరమిడ్ కూడా ఒకటిగా నిలిచింది.
Post a Comment