మనిషిగా పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి అనారోగ్యం అనేది కలుగుతూనే ఉంటుంది. అలా అనారోగ్యం కలగగానే డాక్టర్ల దగ్గరికి పరిగెత్తుకొని వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి ఆరోగ్యాన్ని తెచ్చుకుంటారు. ఇలా డాక్టర్ల దగ్గర డబ్బులు ఖర్చు పెడితే గాని మనకు మనసు ప్రశాంతంగా ఉండదు. మనం డాక్టర్లను కలవకుండానే మన చుట్టూనే ఎన్నో రకాల మందులు మన ప్రకృతి లో దాగి ఉన్నాయి. అవి ఉపయోగిస్తే అనారోగ్యం మన దరికి చేరదు. అటువంటి విలువైన ఔషదాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
- కీళ్ల నొప్పులు, వాతపు నొప్పులు బాధిస్తుంటే కొబ్బరినూనె లో వేపాకు రసం కలిపి వేడిచేసి రాసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
- అనుకోకుండా కడుపునొప్పి వస్తే కంగారు పడకండి! కప్పు మజ్జిగలో ధనియాల పొడి కలిపి తీసుకోండి! కడుపు నిమ్మళ్ళిస్తుంది.
- మూలశంఖ (పైల్స్) బాధితులు 10 గ్రాముల సోపు, 20 గ్రాముల మిరియాలు కలిపి చూర్ణంగా చేసి, రెండు చిటికెలు తేనెతో కలిపి తీసుకుంటే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది.
- 100 గ్రాములు జీలకర్ర వేయించి రెండు వందల గ్రాముల నెయ్యి కలిపి పరగడుపున ఒక చెంచాడు రసం తీసుకుంటే సైనసైటిస్ తగ్గుతుంది.
- కిడ్నీలో రాళ్లు ఏర్పడితే తులసి రసంలో రెండు చెంచాల తేనె కలిపి తీసుకుంటే త్వరగా కరిగిపోతాయి.
- వేపాకుల రసం రాస్తే గజ్జి, పుండ్లు మానుతాయి.
- తీవ్రమైన తలనొప్పితో బాధపడేవారు ఆవుపాలలో సొంటి కలిపి మరిగించి తలకు పట్టుగా వేసుకుంటే తక్కువ సమయంలో బాధ నుండి నివారణ పొందుతారు.
- మునగాకు రసం, తేనె, కొబ్బరి నీళ్లు కలిపి రోజుకు రెండు మూడు సార్లు చిన్న కప్పు తో తీసుకుంటే నీళ్ల విరేచనాలు రక్త విరేచనాలు తగ్గిపోతాయి.
- చర్మం కాలితే నేయి, తేనె కలిపి రాస్తే మంట తగ్గటమే కాక గాయం సైతం త్వరగా మానిపోతుంది.
- ఒళ్ళు మంటలు, దురదలు బాధిస్తుంటే బ్యాక్టీరియాతో ధైర్యంగా పోట్లాడే దానిమ్మ పండ్ల తినండి.
Post a Comment