అంతరించిపోతున్న ఏనుగులు - Endangered elephants

 గజరాజులకు కష్ట కాలం వచ్చింది


దట్టమైన అరణ్యంలో ఏనుగులు ఏర్పరిచిన దారులు మరెన్నో జంతువులకు మార్గాలుగా ఉపయోగపడుతున్నాయి. అంతేకాకుండా శక్తివంతమైన ఏనుగులు నీటి కోసం నేలను తవ్వుతాయి అప్పటికే ఉన్న నేటి స్థావరాలను విస్తృత పరుస్తాయి. ఇతర జీవరాశులకు ఆ నీటి మడుగులు ఉపయోగపడతాయి. సుదూర ప్రాంతాలను చుట్టే ఏనుగులు తమ పేడ ద్వారా ఎన్నో రకాల విత్తనాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేస్తాయి.ఏనుగులు తినే ఆహారంలో దాదాపు సగం వరకు జీర్ణం కాకుండా విసర్జితం అవుతుంది. అది ఇతర కీటకాలకు ఆహారంగా మారుతుంది. మొక్కలకు కూడా సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. ఆవరణ వ్యవస్థలో ఇంత కీలకమైన ఏనుగుల మనుగడ నానాటికి సంక్లిష్టంగా మారుతోంది.


ఏనుగు దంతాలకు అంతర్జాతీయ గిరాకీ ఉంది. అదే గజరాజుల పాలిట శాపంగా మారింది. దంతాలు మాంసం ఇతర శరీర భాగాల కోసం రోజూ దాదాపు 100 ఆఫ్రికా ఏనుగులను అక్రమార్కులు వధిస్తున్నట్లు ఒక అంచనా. మోజాంబిక్ లో 1977-92 మధ్యకాలంలో అంతర్యుద్ధ సమయంలో ఎన్నో ఏనుగులను దంతాల కోసం వధించారు. ఏనుగు దంతాల అక్రమ వ్యాపారానికి వ్యతిరేకంగా 2016లో ఏనుగు దంతాలను దానం చేసింది. 1989లో మనుగడ ప్రమాదంలో ఉన్న జాతుల అంతర్జాతీయ ఒప్పందం (సీఐటిఈఎస్) - ఏనుగుదంత వ్యాపారాన్ని నిషేధించింది. అయినా, జపాన్ తో పాటు మరికొన్ని ఐరోపా దేశాల్లో వాటి చట్టబద్ధ వ్యాపారం కొనసాగుతోంది.

ఆసియా దేశాల్లో దంతాల అక్రమ వ్యాపారం ఏనుగులను వధించడానికి దారితీస్తోంది. ఏనుగుల అక్రమ వధ నివారణ పర్యవేక్షణ కార్యక్రమం (మైక్) గజరాజుల మరణాలకు సంబంధించి కీలకమైన సమాచారాన్ని అందిస్తోంది. ఇండియాలో పది ఎలిఫెంట్ రిజర్వుల్లో మైక్ కార్యక్రమం, ప్రధానంగా ఐరోపా సమాఖ్య ఆర్థిక సహకారంతో అమలవుతోంది.


వ్యవసాయం, మానవ నిర్మాణాలు, అభివృద్ధి పనుల వల్ల ఆవాసాలను కోల్పోవడం లేదా అవి ముక్కలవ్వడం ఏనుగులకు మరో తీవ్ర సమస్యగా పరిణమించింది. దానివల్ల మానవులు ఏనుగుల - ఘర్షణ ఇటీవల కాలంలో అధికమైంది. ఏనుగులను, వాటి ఆవాసాలను కాపాడటానికి, మానవులు - ఏనుగుల మధ్య ఘర్షణను నివారించడానికి, పెంపుడు ఏనుగుల సంక్షేమం వంటి వాటికోసం భారత్లో 1992లో 'ప్రాజెక్ట్ ఎలిఫెంట్' కార్యక్రమం ప్రారంభమైంది. మానవులు ఏనుగుల మధ్య అధిగమించడానికి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ 2020 ఆగస్టులో సురక్ష్య పేరుతో జాతీయ పోర్టల్ ను ప్రారంభించింది. 2010 నుంచి జాతీయ వారసత్వ జంతువుగా ఏనుగును పరిగణిస్తున్నాం అని ఈ జాతీయ పోర్టల్ ఉద్దేశం.


దేశీయంగా ప్రతి ఐదేళ్లకోసారి ఏనుగుల జాబితాను లెక్కిస్తారు. 2017 అంచనాల ప్రకారం ఇండియాలో 27 వేలకు పైగా ఏనుగుల జనాభా 23 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ప్రస్తుతం భారత్ లో 32 ఎలిఫెంట్ రిజర్వులు ఉన్నారు. దేశంగా అత్యధిక సంఖ్యలో ఏనుగులు కర్ణాటక రాష్ట్రంలో కనిపిస్తాయి. వివిధ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఏనుగుల జనాభాని కలపడానికి వీలుగా 28 కారిడార్లను గుర్తించారు. అందులో కొన్ని ఆక్రమణకు గురయ్యాయి. కొన్నింటిలో రైల్వే మార్గాలు ఉన్నాయి. 1987 - 2017 మధ్య కాలంలో 267 ఏనుగులు రైల్వే మార్గాలు దాటుతూ మరణించాయని ఒక అంచనా. ఒక్క ఈశాన్య సరిహద్దు రైల్వే ప్రాంతంలోనే 1990 - 2022 మధ్యకాలంలో 120 ఏనుగులు రైలు డీ కొని ప్రాణాలు కోల్పోయాయి.

నానాటికి తరిగిపోతున్న ఏనుగులను కాపాడుకోవాలంటే దెబ్బతిన్న వాటి ఆవాసాలను పునరుద్ధరించాలి. రోడ్లు, కాలువలు, రైలు మార్గాలు వంటివి ఉన్నచోట ఏనుగుల సంచారానికి, వలసలకు విఘాతం కలగకుండా వంతెనలు, అందరు పాస్ లను ఏర్పాటు చేయాలి. కృత్రిమ మేధ సహాయంతో ఈశాన్య సరిహద్దు రైల్వే పరిధిలో అస్సాంలోని లుండింగ్, అలీపూర్ దువార్ డివిజన్లలో 70 కిలోమీటర్ల మేర ఏనుగు కారిడార్ లో 2022 ఆగస్టు నుంచి గజరాజుల మరణాలను పూర్తిగా నిరోధించారు. ఏనుగులు సంచరించే అన్ని ప్రాంతాలకు ఈ తరహా విధానాన్ని విస్తరించాలి. గజరాజుల వేట నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం తప్పనిసరి. ఏనుగు దంతాల అక్రమ వ్యాపారం పై అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా చర్యలు తీసుకోవాలి. అప్పుడే గజరాజుల సంరక్షణ సాధ్యమవుతుంది.



Post a Comment

Previous Post Next Post